అల్లు వర్సెస్ మెగా వార్ కి ఫుల్ స్టాప్ : నెగ్గింది ఎవరు..? తగ్గింది ఎవరు..?
మరి కొంతమంది మెగా అండ లేకుండానే ఎదిగాను అనుకుంటున్న అల్లు అర్జున్ కి ఇప్పుడు ఆ మెగా వాల్యూ ఏంటో తెలిసింది అంటున్నారు . అయితే కొంతమంది మాత్రం అసలు ఈ మెగాహీరోస్ సపోర్ట్ లేకుండానే..ప్రమోషన్స్ కి వాళ్లని పిలవకుండానే సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసుకున్నాడు అల్లు అర్జున్ అంటూ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూలో ఎవ్వరు గెలిచిన్నట్లు..? ఎవరు ఓడిన్నట్లు..?
మెగా సపోర్ట్ లేకుండా పుష్ప 2 సినిమాని హిట్ చేసుకున్న అల్లు అర్జున్ నెగ్గిన్నట్లా..? లేక అసలు పుష్ప2 సినిమాకి ఏమాత్రం సపోర్ట్ చేయకుండా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యావాడు అని తెలియగానే పరుగు పరుగున మెగాస్టార్ చిరంజీవి అల్లు ఫ్యామిలీ ఇంటికి వెళ్లి మరి పెద్దరికం చాటుకుని బన్నీకి బెయిల్ వచ్చేలా చేసి పెద్దరికంగా బీహేవ్ చేసిన మెగాస్టార్ నెగ్గిన్నట్లా..? ఇద్దరిలో ఎవరు నెగ్గినా..? తగ్గినా..? అది ఇద్దరికీ మంచిదే అంటూ సినీ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు . ఇక మెగా వర్సెస్ అల్లు వార్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఎవరి పని వాళ్ళ చూసుకుంటే బెటర్ అంటున్నారు . త్వరలోనే పవన్ కళ్యాణ్ ని కూడా అల్లు అర్జున్ కలవబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . మళ్లీ ఒక్కసారి అల్లు మెగా హీరోస్ అందరూ కూడా గ్రూప్ ఫోటో దిగితే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు ఫ్యాన్స్. చూద్దాం ఆ టైం ఎప్పుడు వస్తుందో..???