జనసేనలో చేరనున్న మంచు మనోజ్..ఏకంగా 1000 కార్లతో ఎంట్రీ ?
అతి త్వరలోనే జనసేన పార్టీలోకి మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్, భూమా మౌనిక వెళ్ళిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఆళ్లగడ్డలో శోభ నాగిరెడ్డి... జయంతి వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలకు... మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ అలాగే మౌనిక.. ఇద్దరు వెళ్తున్నారు. దాదాపు 1000 నుంచి 1500 కార్లలో... ఆళ్లగడ్డ కు వెళ్లేందుకు స్కెచ్ వేశారట మంచు మనోజ్ అలాగే మౌనిక.
ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారట. అయితే ఆళ్లగడ్డకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత... రాజకీయ అరంగేట్రం పై మంచు మనోజ్ కీలక ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భూమా ఘాట్ లో.. రాజకీయా ఆరంగేట్రంపై ప్రకటన చేయ బోతున్నారట మంచు మనోజ్ కుటుంబ సభ్యులు.మంచు మనోజ్ తో పాటు మౌనిక కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారట.
జనసేన పార్టీలో చేరి... బలంగా రావాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుత కుటుంబ వివాదాల నేపథ్యంలో... రాజకీయంగా బలపడాలని... మంచు మనోజ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ సారాద్యం వహిస్తున్న జనసేన పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారట. అంతే కాదు నంద్యాల నుంచి పొలిటికల్ ఎంట్రీ... ప్రారంభం కూడా కానుంది. దీంతో మనోజ్ అలాగే మౌనిక... పొలిటికల్ ఎంట్రీ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.