బిగ్ బాస్ -8: నిఖిల్ విజయానికి అసలు కారణం అదేనా.. జనాలను గొర్రెలను చేసారుగా?
అయితే నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. తన మాట, ఆటతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకున్నాడు. దీంతో మొదటి నుండి నిఖిల్ కి మాత్రమే సీజన్ 8 విన్నర్ అయ్యే అర్హత ఉందని టాక్ వినిపిస్తూనే ఉంది. ఇక ఈ సీజన్ లో వైల్డ్ కార్డులతో కలిపి 22 మంది బిగ్ బాస్ హౌస్ కి ఎంటర్ అయ్యారు. అందులో వైల్డ్ కార్డు ద్వారా గౌతమ్ వైల్డ్ గా ఎంట్రీ ఇచ్చి నిఖిల్ కి గట్టి పోటీ ఇచ్చాడు. ఇక వీరిద్దరి మధ్య రసవత్తరంగా పోటీ సాగినప్పటికి.. నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిలిచాడు. రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతీ లగ్జరీ కారుని కూడా బహుమతిగా పొందాడు. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకూ ప్రైజ్ మనీ రూ.50 లక్షలకు మించి లేదు. అయితే తొలిసారిగా రూ. 55 లక్షల ప్రైజ్ మనీని నిఖిల్ అందుకోవడం విశేషం.
ఇదిలా ఉండగా గౌతమ్ చాలా గట్టిగా ఆడినప్పటికీ విన్నర్ అవ్వకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్టార్ మా లో నటుడిగా ఉన్నందుకే నిఖిల్ విజేతగా నిలిచాడని రూమర్స్ జనాల్లో వినిపిస్తున్నాయి. ఏం జరిగిన ఎలా ఆడిన బిగ్ బాస్ నిర్ణయం ప్రకారమే విజేత డిసైడ్ అవుతాడాని కొందరు అనుకుంటున్నారు. కానీ నిఖిల్ ఆట తీరు వల్లే గెలుపు సాధించడాని, తెలుగు నటుడు కాకపోవడంతో కన్నడ బ్యాచ్ అంటూ నిఖిల్ గెలుపుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు.