ఎన్టీఆర్ లైనప్ లో ఇది గమనించారా.. ఆ దర్శకులకే వరుస ఆఫర్లు ఇస్తున్నారా?
తారక్ ప్రస్తుతం వార్2 సినిమాలో నటిస్తుండగా అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తారక్ తర్వాత మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా కన్నడ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాల తర్వాత తారక్ తమిళ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించే అవకాశం అయితే ఉంది. ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ ఊహించని స్థాయిలో మారిపోయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏడాదికి ఒక సినిమాలో నటించే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. 2025లో తారక్ నటించిన వార్2 రిలీజ్ కానుంది. హృతిక్, ఎన్టీఆర్ కాంబో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా రికార్డ్ క్రియేట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేసే కథలకు ఓటేస్తున్నారు.
తారక్ కు 2025 సంవత్సరం కెరీర్ పరంగా కలిసిరావాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. వార్2 సినిమా కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తారక్ రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.