స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ తల్లితో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఏమిటో తెలుసా ..!

Amruth kumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రీసెంట్ గానే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో అడుగు పెట్టింది .. అయితే ఆమె తల్లి కూడా హీరోయిన్ అనే విషయం చాలామందికి తెలియదు .. అలాగే ఆమె చిరంజీవితోనే సినిమా చేసింది .. ఆ సినిమా ఏంటి ? ఆ సినిమా ఫలితం ఏంటి ? ఏ సినిమాలో చిరు కీర్తి తల్లితో నటించారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..  మెగాస్టార్ చిరంజీవి తన ఐదు దశాబ్ధాల  సినీ కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు .. తన సినిమాలతో ఎంతోమంది హీరోయిన్లను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు .. అయితే ఓ హీరోయిన్‌తో ఇంత చిరు కలిసి నటిస్తే ఆమె కూతురికి బ్రదర్ గాను నటించాడు.. అలాగే తల్లితో మంచి విజయం అందుకున్నాడు .. కానీ కూతురుతో మాత్రం విజయం అందుకోలేకపోయాడు. . ఇంతకీ ఆమె ఎవరు .. ఆ సినిమా ఏంటి .. అనేది ఈ స్టోరీలో చూద్దాం.

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రీసెంట్ గానే పెళ్లి చేసుకుని తన చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తట్టిల్‌ని పెద్దలు ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది .. ఈ క్రమంలోనే ఆమె ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ లో మారాయి .. కీర్తి సురేష్ తల్లి మేనక .. ఆమె కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఎన్నో సినిమాలో నటించింది.. మలయాళం లో ఆమె ఎక్కువ సినిమాలు చేసింది .. అలాగే టాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో ఆమె నటించింది. అయితే కీర్తి సురేష్ తల్లి మేనకతో చిరంజీవి సినిమా చేయటం విశేషం .. వీరిద్దరి కాంబినేషన్లో పున్నమినాగు అనే సినిమా వచ్చింది .. 1980లో విడుదలైన ఈ   సినిమాను రాజశేఖర్ తెరకెక్కించాడు .. ఈ సినిమాలో చిరంజీవి నెగటివ్ రోల్ లో నటించారు .. హీరోయిన్లుగా మేనక, రతి అగ్నిహోత్రి, జయమాలిని, మాధవి నటించారు.. ఈ సినిమాలో చిరంజీవి ఇష్టపడే అమ్మాయిగా మేనక కనిపిస్తుంది .. ఆమె పాత్ర కూడా సినిమాలో ఎంతో అద్భుతంగా ఉంటుంది .. ఈ సినిమాలు నెగటివ్ రోల్ లో చిరంజీవి తన విశ్వరూపం చూపించారు.

మేనక సురేష్ ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది .. పున్నమినాగు సినిమా మంచి విజయం సాధించింది.. ఇందులో చిరంజీవి హీరో కాకపోవటం వల్ల ఆ ఇంపాక్ట్ ఆ సమయంలో ఆయన కెరియర్ పై పడింది .. ఈ సినిమా తర్వాత మేనక మరో రెండు సినిమాల్లో కూడా తెలుగులో నటించింది .. దవళ సత్యం తెరకెక్కించిన సుబ్బారావుకి కోపం వచ్చింది అనే సినిమాలో నటించిన అయితే ఈ సినిమా సరిగ్గా ఆడలేదు. మరో సీనియర్ హీరో రాజశేఖర్ తోనూ ఇంద్రధనస్సు అనే సినిమాలో నటించింది .. ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది .. ఇక దాంతో మేనక తెలుగు సినిమాలుకు దూరమైంది .. 1987 నిర్మాత సురేష్ను పెళ్లి చేసుకుని తర్వాత సినిమాలుకు దూరమైంది. తర్వాత చిరంజీవి మేనక కూతురు కీర్తి సురేష్ తోను గ‌త‌ ఏడాది భోళ‌ శంకర్ సినిమాలో నటించాడు .. ఈ సినిమాలో చిరంజీవి కీర్తికి అన్నగా కనిపించాడు. . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది .. సినిమా తర్వాత నుంచి కీర్తికి సినిమా ఆఫర్లు కూడా తగ్గాయని అంటారు .. తెలుగులో సరైన ఆఫర్లు లేకపోవడంతో కీర్తి తమిళం , హిందీ సినిమాల్లో నటిస్తుంది.. ప్ర‌స్తుతం సినిమాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: