వామ్మో: నటుడు బ్రహ్మాజీకి గట్టి వార్నింగ్ ఇస్తున్న స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్..!
ఇటీవల పుష్ప 2 చిత్రంలో స్పెషల్ సాంగ్లో నటించిన శ్రీలీల దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి అనే పాట బాగా పాపులారిటీ సంపాదించింది.ఈ సినిమాతో శ్రీ లీల క్రేజ్ మరొకసారి పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటకి రీల్స్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. వైరల్ గా మారుతున్న వీడియో ప్రకారం శ్రీ లీల, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కలిసి దెబ్బలు పడతాయి రాజా అనే సాంగ్ కి రీల్స్ చేయడం జరిగింది.
ఇందులో బ్రహ్మాజీ కూర్చొని మరి వీడియో తీస్తూ ఉండగా శ్రీ లీల తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో బ్రహ్మాజీకి గట్టి వార్నింగ్ ఇస్తూ దెబ్బలు పడతాయి అంటూ ఫన్నీ గా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో శ్రీ లీల ఈ వీడియోకు ఫోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. బ్రహ్మాజీ పుష్ప 2 చిత్రంలో కూడా నటించారు.