నీ రూపం గుండెల్లో చిరస్మరణీయం .. ఈ స్టార్ హీరో గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!
బుల్లితెరపై తన అద్భుతమైన నటనతో మెప్పించిన సిద్ధార్థ్ .. చిన్న వయసులోనే తన జీవితములో ఓడిపోయాడు.. 1980 డిసెంబర్ 12 ముంబైలో పుట్టాడు.. అతను తండ్రి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవాడు .. ఇక తల్లి రీటా శుక్లా హౌస్ వైఫ్ .. అతని ఆరు సంవత్సరాల వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు .. దాంతో అతన్ని తల్లి , అక్క ఎంతో ముద్దుగా పెంచారు. సిద్ధార్థ్ ఇంటీరియర్ డిజైనర్ లో డిగ్రీ పూర్తి చేశాడు.. అలాగే టెన్నిస్ , ఫుట్బాల్ ప్లేయర్ కూడా.. ఇక అండర్ 19 ఫుట్బాల్ కప్ లో కూడా ఇతను సభ్యుడు.. అలాగే సిద్ధార్థ్ కొన్ని సంవత్సరాలు ఇంటీరియర్ డిజైనర్ గా కూడా పనిచేశాడు .. అతను తల్లి కోరిక మేరకు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు.. ఇక 2004లో గ్లాడ్రాగ్స్ మాన్‌హంట్, మెగామోడల్ కాంటెస్ట్‌లలో రన్నరప్ గా నిలిచాడు. ఆ తర్వాత అరుణ్ మ్యూజిక్ వీడియో ‘రేషమ్ కా రుమాల్’లో సిద్ధార్థ్ మొదటిసారి కనిపించాడు.
అదేవిధంగా 2005లో సిద్ధార్థ్ వరల్డ్ బెస్ట్ మోడల్ కాంటెస్ట్‌లో ఇండియాకి ప్రాతనిద్దాం వహించాడు .. తర్వాత సిద్ధార్థ్ పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా ప్రకటనలు కూడా చేశాడు. సిద్ధార్థ్ కి చెన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా మంచి క్రేజ్ వచ్చింది. ఈ సీరియల్ తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది.. అలాగే 2019 లో బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 13లో పాల్గొని టైటిల్ విజేతగా నిలిచాడు. అలాగే అదే సమయంలో తన తోటి కంటెస్టెంట్ షెహనాజ్ గిల్ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.. బిగ్బాస్ షో తర్వాత అతనికి మంచి గుర్తింపు వచ్చింది.. పలు సినిమాల్లో కూడా అవకాశం వచ్చింది.. అదే సమయంలో ఊహించని విధంగా హార్ట్ ఎటాక్ రావడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు .. సిద్ధార్థ్ అతి చిన్న వయసులోనే ఎంతో ఫ్యూచర్ ఉన్న దేవుడు తొందరగా తీసుకుపోయాడు ..