టాలీవుడ్ మొత్తం కదిలిన .. అల్లు అర్జున్ ను ఎన్టీఆర్ కలకపోవడానికి కారణం ఇదే..!

Amruth kumar
పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట ఘటన జరిగింది .. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఈ ఘటనలో రేవతి అనే మహిళా ప్రాణాలు కోల్పోయింది. . ఆమె చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ కార‌ణ‌మ‌ని పోలీసులు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు .. ఆ ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేశారు. మొన్న బన్నీ ఇంటివద్దె పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు .. అనంతరం గాంధీ ఆస్పత్రిలో ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తర్వాత నాంపల్లి కొర్ట్‌ ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది .. దాంతో ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు .. అదే క్రమంలో బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్ట్ ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తుంది .. కొన్ని అనుకోని కారణాలతో శుక్రవారం రాత్రి అంతా బన్నీ జైల్లోనే ఉన్నారు..

శనివారం ఉదయం ఆయనను జైలు నుంచి రిలీజ్ చేశారు.. ఆయన రిలీజ్ అయిన తర్వాత శనివారం ఆయన ఇంటికి టాలీవుడ్ ప్రముఖులందరూ వచ్చి ఆయనను పరామర్శించారు .. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఆయన వద్దకు రాలేదు .. దీనిపై టాలీవుడ్ లో పలు గుసగుసలు వినిపిస్తున్నాయి .. ఎన్టీఆర్ రాకపోవడానికి ప‌లు కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది .. అవేమిటో ఇక్కడ చూద్దాం. ముందుగా బన్నీ జైలు నుంచి వచ్చిన వెంటనే ఇంటికి టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది వచ్చారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు , వంశీ పైడిపల్లి , కొరటాల శివ , మైత్రి నిర్మాతలు , దిల్ రాజు , విజయ్ దేవరకొండ , సుధీర్ బాబు , అఖిల్ , అడవి శేషు వంటి అగ్ర హీరోలు కూడా వెళ్లి బన్నీని పరామర్శించారు. ఇదే క్రమంలో  హీరో ప్రభాస్ కూడా ఆయనకు ఫోన్ చేసి తర్వాత ఆయన వద్దకు వచ్చి మరీ మాట్లాడారు.. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ బన్నీ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి అందరికీ తెలుసు .. అల్లు అర్జున్ , ఎన్టీఆర్ ఎంతో క్లోజ్ గా ఉంటారు ..

ఇక ఇద్ద‌రు కలిసి సినిమాలో నటించకపోయిన వారి మధ్య మంచి బాండింగ్ ఉంది .. ఒకరినొకరు బావ అని ప్రేమగా పిలుచుకొనేంత క్లోజ్ గా ఉంటారు .. వారికి సమయం వచ్చినప్పుడల్లా తమ బాండింగ్ గురించి మాట్లాడుతూనే ఉంటారు .. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ , అల్లు అర్జున్ ను వచ్చి ఎందుకు కలవలేదని నెట్టిజ‌నులు సోషల్ మీడియాలో పోస్ట్లు పడుతున్నారు . నిజానికి ఎన్టీఆర్ ముంబైలో ఉన్నారని తెలుస్తుంది .. వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారని .. వార్ 2 షూటింగ్ కొత్త షెడ్యూల్ జరుగుతుంది .. హృతిక్ , ఎన్టీఆర్ ల‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు .. అందుకే హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ ను ఎన్టీఆర్ కలవలేదని తెలుస్తుంది .. అందుకే ఫోన్ చేసి అల్లు అర్జున్ తో మాట్లాడారని టాక్ ... హైదరాబాద్ వచ్చిన వెంటనే ఎన్టీఆర్ బన్నీని కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: