తస్సాదియా.. కనిపెట్టండి చూద్దాం... ఈ స్టార్ యాంకర్ ఎవరో గుర్తుపట్టారా..?
పైన ఫోటోలోని యాంకర్ టీవీ షో లతో పాటు పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. అలాగే పద్దుల సంఖ్యలో టీవీ షోలో చేసింది .. ప్రస్తుతం కాస్త బ్రేక్ ఇచ్చిన యాంకర్ .. ఆమెను గతంలో జూనియర్ శ్రీదేవి అని కూడా అనేవారు.. ఇంతకీ ఆ యాంకర్ మరెవరో కాదు ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను .. ఈ అందాల యాంకర్ ను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు .. ఒకప్పుడు ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో క్రేజ్ తెచ్చుకుంది.
అలాగే ఉదయభాను యాంకర్ గా చేస్తూనే పలు సినిమాల్లో కూడా నటించింది.. ఆమె టెన్త్ క్లాస్ చదువుతుండగా తొలి సినిమా ఎర్రసైన్యంలో చేసింది.. ఆ తర్వాత పలు తమిళ , కన్నడ సినిమాల్లో కూడా ఈమె నటించింది .. అదేవిధంగా శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది ఉదయభాను .. ఇక ఉదయభాను చేసిన టీవీ షోల్లో వన్స్ మోర్ ప్లీజ్ , సాహసం చేయరా డింబకా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రే రేలా , ఢీ రియాలిటీ డ్యాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు ఇలా చాలా షోల్లో యాంకర్ గా చేసి మెప్పించింది. ఇప్పుడు ఉదయభాను యాంకరింగ్ కు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు.