పుష్ప రాజ్ ఒక్క సంవత్సరంలో ఎంత పన్ను చెల్లించాడో తెలుసా.. సినిమాలనే కాదు రియల్ గా నెంబర్ వన్..!

Amruth kumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించుకుంటూ దూసుకుపోతుంది .. ఇప్పటికే ఈ సినిమా 1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది .. అలాగే ఇండియన్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 3 సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది .. త్రిబుల్ ఆర్ , కే జి ఎఫ్ 2 రికార్డులను తిరగరాసి .. బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది .. ఇదే క్రమంలో 2023 - 24 ఆర్థిక సంవత్సరంలో .. అత్యధిక పన్ను చెల్లించిన పన్ను చెల్లింపు దారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు ..

కేవలం సినిమాల్లోనే కాకుండా పన్ను చెల్లింపు విషయంలోనూ తానే నెంబర్ వన్ అన్ని నిరూపించుకున్నాడు అల్లు అర్జున్ . పుష్ప 1 & 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ప్రభంజనం సృష్టించిన అల్లు అర్జున్ అటు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ తో పాటు .. బాలీవుడ్ హిందీ ప్రేక్షకుల ప్రేమను కూడా పొందాడు .. ఫార్చ్యూన్ ఇండియా రిపోర్టు ప్రకారం .. ఇండియాలో టాప్ - 22 ఆదాయ పన్ను చెల్లింపు దారుల్లో చోటు దక్కించుకున్న ఏకైక తెలుగు హీరో అల్లు అర్జున్ మాత్రమే . ఫార్చ్యూన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి గాను అల్లు అర్జున్ 14 కోట్లకు పైగా పన్ను చెల్లించాడు ..

అదే రిపోర్టులో ఉన్న దాన్ని బట్టి అతని మొత్తం ఆస్తిపాస్తులు విలువ సుమారు 500 కోట్ల పైన ఉంటుంది.  తాజా గా మీడియా రిపోర్టుల ప్రకారం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం రెమ్యూనిరేషన్ తీసుకోలేదు .. కానీ సినిమా ఆదాయంలో 40% షేర్ పొందాడు. పుష్ప 2 మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయ పరంపరగా కొనసాగుతుంది . అల్లు అర్జున్ సినిమా లోనే కాకుండా గవర్నమెంట్ ట్యాక్స్ విషయం లో కూడా నెంబర్ వన్ గా నిలిచాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: