మరో వివాదంలో నయనతార భర్త..ప్రభుత్వ ఆస్తులపై కన్ను ?

Veldandi Saikiran
తమిళ స్టార్ హీరోయిన్  నయనతార గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అత్యధిక డిమాండ్ ఉన్న తమిళ స్టార్ హీరోయిన్ నయనతార అని చెప్పవచ్చు. కొన్నేళ్ల నుంచి తమిళ స్టార్ హీరోయిన్  నయనతార ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తోంది. స్టార్ హీరోల సినిమాల నుంచి యంగ్ హీరోల సినిమాల వరకు అందరితో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. 


ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ముందు వరసలో ఉంటారు. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా యాడ్ షూట్స్ లలోను నటిస్తూ భారీగా డబ్బులను ఆర్చిస్తోంది. నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇద్దరు మగ కవల పిల్లలు కూడా ఉన్నారు. 

తమిళ స్టార్ హీరోయిన్  నయనతార సమయం దొరికినప్పుడల్లా తన పిల్లలతో సమయాన్ని గడుపుతూ మధురమైన జ్ఞాపకాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా.... దర్శకుడు విగ్నేష్ శివన్ పుదుచ్చేరి వెళ్లారు. అక్కడ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రితో సమావేశమయ్యారు. అక్కడి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సీగల్ హోటల్ ను కొనుగోలు చేయడానికి విగ్నేష్ శివ ప్రయత్నాలు చేశారట. కానీ అక్కడ మంత్రి నిరాకరించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలిసి ప్రభుత్వానికి చెందిన బంగ్లాను ఎవరైనా కొనుగోలు చేస్తారా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

కాగా, ఈ విషయం పైన విగ్నేష్ శివన్ క్లారిటీ ఇచ్చారు. నా సినిమాలు, లవ్ ఇన్సూరెన్స్ షూటింగ్ అనుమతి కోసం పాండిచ్చేరి వెళ్లానని విగ్నేష్ శివన్ చెప్పాడు. అనంతరం పర్యాటక శాఖ మంత్రి కలిశాను. ఆ సమయంలో నాతో పాటు వచ్చిన వ్యక్తి తనకు అవసరమైన కొన్ని విషయాల గురించి ఆరా తీయడం జరిగింది. దానిని తప్పుగా అర్థం చేసుకుని నన్ను విమర్శించి చాలామంది మీమ్స్ పెట్టారని విగ్నేష్ శివన్ వివరణ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: