2011 లో ఆ సంఘటన మరిచిపోలేనిది.. నయనతార షాకింగ్ కామెంట్స్..!
అయితే విగ్నేష్ కంటే ముందుగా నటుడుగా డాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా పేరు పొందిన ప్రభుదేవతో ఈమె డేటింగ్ చేసింది. నయనతార, ప్రభుదేవా కోసం తన నటన జీవితాన్ని కూడా విడిచి పెట్టాలని నిర్ణయించుకున్నదట.ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార తన జీవితంలో జరిగిన విషయాలను పంచుకుంది.. తన జీవితంలో ప్రేమ కావాలి అంటే తాను కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుందని తాను భావించే దశలో ఉండే దాన్ని ఆ సమయంలో తాను చాలా సున్నితంగా కూడా ఉన్నానని.. తన ఇండస్ట్రీల చాలా రిలేషన్స్ చూశాను వారందరూ కూడా చెడ్డవారని చెప్పలేను.. అందుకే ఆ సమయంలో తాను ఓకే అనుకున్నాను ప్రేమ కావాలి అంటే ఎక్కడో ఒకచోట రాజీ పడాలని ఒక నిజాయితీ గల అమ్మాయిగా జీవించాలనుకున్నానని తెలిపింది.
ప్రేమ కోసం అన్ని వదులుకోవాలి భాగస్వామికి నచ్చకపోతే వదులుకోవాలని.. కేవలం ప్రేమ పైన తనకు ఉన్న అవగాహన అలాంటిదే అని కానీ ఆ తర్వాత చాలా స్ట్రాంగ్ గా మారిపోయాను ఈరోజు తాను ఇక్కడ ఉన్నాను అంటే ఆ బంధం వల్లే ఆ బంధం లేకుంటే తాను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు అంటూ తెలిపింది. చివరిగా శ్రీరామరాజ్యం సినిమా చేసినప్పుడు సినిమాలకు దూరంగా ఉండలేనని తనకి అర్థం అయ్యిందని తెలిపింది నయనతార.