నేషనల్ అవార్డు రేసులో నలుగురు సౌత్ హీరోలు.. టాలీవుడ్ నుండి ఒకే ఒక్కడు ఎవరంటే?
అలాగే విక్రమ్ ముఖ్య పాత్రలో నటించిన తంగలాన్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. విక్రమ్, పా.రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ఈ ఏడాది ఆగష్టు 15న విడుదలయ్యింది. అయితే, తంగలాన్ సినిమా చూసిన అభిమానులు ఫుల్ జోష్‌తో తిరిగి వెళ్లారని టాక్ కూడా వచ్చింది. ఈ సినిమాతో విక్రమ్ కూడా నేషనల్ అవార్డు రేసులో ఉండడం జరిగింది. ఇక మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఆడు జీవితం. సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో అమలా పాల్ హీరోయిన్ గా నటించింది. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ నేషనల్ అవార్డు రేసులో టాలీవుడ్ నుండి ఒకే ఒక్క హీరో ఉన్నారు. అతనే మన పుష్ప రాజ్. పుష్ప ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా లో హీరోగా అల్లు అర్జున్, హీరోయిన్ గా రష్మికా మందన్న నటించారు. ఇక ఫహాద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా తో పుష్ప రాజ్ గా క్రేజ్ స్పందించుకున్న ఐకన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు నేషనల్ అవార్డు రేసులో కూడా చోటు దక్కించుకున్నారు.