హెరాల్డ్ టాలీవుడ్ సూపర్ హిట్స్ 2024: చిన్న సినిమాగా వచ్చి ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొట్టిన మూవీ.!
గోదావరి బ్యాక్ డ్రాప్ లో వర్షాకాలంలో ఈ సినిమాని చాలా అందంగా చూపించారు.నార్నె నితిన్ చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో సింపుల్ గా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి మాత్రం కామెడీతో ఫుల్ గా నవ్వించారు. నయన్ సారిక సోషల్ మీడియాలో ఫేమస్ అమ్మాయిగా గలగలా మాట్లాడుతూ మెప్పిస్తుంది. కార్తీక్ తండ్రిగా వినోద్ కుమార్, పల్లవి తండ్రిగా మైమ్ గోపి, సరయు, VTV గణేష్.. మిగిలిన నటీనటులు కూడా బాగా నటించారు.సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. గోదావరి ఊళ్ళల్లో తీయడం, ఎక్కువ షూట్ వర్షాకాలంలో తీయడంతో విజువల్స్ ఇంకా బాగున్నాయి. లొకేషన్స్ కూడా చాలా ఆహ్లాదకరమైన లొకేషన్స్ పట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా, కామెడీగా ఉంది. ఒక్క ఐటెం సాంగ్ తప్ప మిగిలిన సాంగ్స్ బాగున్నాయి. దర్శకుడిగా అంజి ఒక రెగ్యులర్ కథని, సీరియస్ సబ్జెక్టుని తీసుకొని కామెడీగా మంచి కథనంతో రాసుకొని చాలా బాగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా చిన్న సినిమా అయినా బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ఆయ్ సినిమా ఓ ముగ్గురు ఫ్రెండ్స్ చేసే అల్లరి, ప్రేమలో క్యాస్ట్ ప్రాబ్లమ్ ని కామెడీగా చూపించి నవ్వించారు.ఇదిలావుండగా ఆయ్ సినిమా 110 స్క్రీన్‌లతో మొదలై 382 స్క్రీన్‌లకు వెళ్లింది.ఇక యూఎస్‌లో 27 స్క్రీన్లతో మొదలై 86 వరకు వెళ్లిందని, దీనంతటికి ఆడియెన్స్ ఆదరణే కారణమని అని ఆయ్ సక్సెస్ మీట్ లో బన్నీ వాస్ చెప్పుకొ చారు.మొత్తానికి ఆయ్ మూవీ 8కోట్ల బడ్జెక్ట్ తో2024లో చిన్న సినిమాగా వచ్చి బాక్సఆఫీస్ దగ్గర 15.75కోట్ల తో ఉహించని కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది.ఇదిలావుండగా మ్యాడ్, ఆయ్ సినిమాలతో బ్లాక్బాస్టర్స్ అందుకున్న నార్నె నితిన్ తర్వాత ఎలాంటి సినిమాలు చేస్తాడన్నా ఆసక్తి అందరిలోనూ ఉంది. కథా ప్రాధన్యమున్న సినిమాలు చేస్తున్నాడంటూ.. ప్రేక్షకులు కూడా అతని సినిమాలు గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నార్నె శ్రీశ్రీశ్రీ రాజావారు, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు చేస్తున్నాడు. మ్యాడ్ సూపర్ హిట్ కావడంతో మ్యాడ్ స్క్వేర్పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. శ్రీశ్రీశ్రీ రాజావారు దసరాకు విడుదల కావాల్సి ఉంది కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది.