చిరుని అస్సలు నమ్మలేము.. ఈ సినిమాలైనా కన్ఫామ్ అయినట్లేనా..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన కష్టంతో డిసిప్లిన్ తో ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ , ఒక్కో విజయాన్ని సాధిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. స్టార్ హీరో స్థాయికి ఎదిగిన తర్వాత కూడా ఎంతో కష్టపడి సినిమాల్లో నటిస్తూ మరెన్నో విజయోను అందుకొని ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే చిరంజీవి సినిమా కథ అద్భుతంగా నచ్చి , మూవీ హిట్ అవుతుంది అనే ఉద్దేశానికి వస్తేనే మూవీ ని ఓకే చేస్తూ ఉంటాడు.

అందులో భాగంగా ఏదైనా దర్శకుడితో సినిమా చేయాలని అనుకున్నా కూడా ఆ తర్వాత కథ బాకోకపోతే ఆ సినిమానే పక్కన పెట్టేస్తాడు. ఈ మధ్యకాలంలో చిరంజీవి , వెంకీ కుడుమల దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కమిట్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత వీరి కాంబో మూవీ క్యాన్సిల్ అయింది. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు హీరోగా ఓ మూవీ రాబోతుంది అని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ మూవీ కూడా క్యాన్సల్ అయింది. ఇకపోతే తాజాగా చిరంజీవి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని వార్తలు వస్తున్నాయి.

ఇక చిరంజీవి , శ్రీకాంత్ ఓదెల కలిసి ఉన్న ఫోటోలను కూడా విడుదల అయ్యాయి. ఇకపోతే చిరంజీవి మొదట ఒకే చెప్పిన ఆ తర్వాత కథ బాగోకపోతే సినిమా పక్కన పెట్టేస్తాడు అని , చిరంజీవిని అస్సలు నమ్మలేము. స్టోరీ సూపర్ గా ఉంటేనే చిరంజీవి సినిమాను స్టార్ట్ చేస్తాడు. మూవీ సెట్స్ పైకి వెళ్తేనే నమ్మగలం అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. మరి చిరు తన నెక్స్ట్ మూవీలను ఎవరితో చేస్తాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: