క అనే వెరైటీ టైటిల్ తో మన ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన దమ్మేంటో చూపించాడు. అలాంటి కిరణ్ అబ్బవరం ఇప్పటివరకు చేసిన ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యం విష్ణు కథ, రాజావారు రాణి గారు వంటి సినిమాలు తప్ప మిగతా సినిమాలేవి ఆశించినంత ఫలితాన్ని అందివ్వలేదు. దీంతో క అనే వెరైటీ టైటిల్ తో మన ముందుకు వచ్చారు.అయితే దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది..100 కోట్ల కలెక్షన్స్ వచ్చే ఈ సినిమాని తొక్కేసింది ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
చిన్న సినిమా బాగా వచ్చి పెద్ద హిట్టు కొట్టిన సినిమాలలో క మూవీని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా కాన్సెప్ట్ డైరెక్షన్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. దాదాపు 20 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన క మూవీ లో హీరోగా కిరణ్ అబ్బవరం హీరోయిన్స్ గా నయన్ సారిక,తన్వి రాం లు నటించారు.. ఈ సినిమాకి సుజిత్,సందీప్ లు సంయుక్తంగా దర్శకత్వం వహించారు.ఇక సినిమా టైటిల్ ని వెరైటీగా తీసుకువచ్చి ట్రైలర్ తోనే ఆసక్తి పెంచారు. ఈ ట్రైలర్ చూసిన చాలా మంది సినిమా చూడడానికి ఆసక్తి కనబర్చారు. అలా విడుదలైన క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసింది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం లాంటి హీరో ఖాతాలో ఇలాంటి బ్లాక్ బస్టర్ పడడం ఆయన కెరీర్ కి బూస్టింగ్ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ప్లాప్ అయితే గనుక నేను సినిమాలు మానేస్తాను అని కిరణ్ అబ్బవరం చెప్పారు.
ఇక ఆయన సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. కానీ సినిమా చూస్తే ఆయన చెప్పిన గొప్పతనం ఈ సినిమాలో కనిపిస్తుంది.ముఖ్యంగా కర్మఫలం, రుణానుబంధం వంటి ఎన్నో కాన్సెప్టులు ఈ సినిమాలో చూపించారు దర్శకులు. అలాగే ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయి.ఈ సినిమాలో పోస్ట్ మెన్ గా కిరణ్ అబ్బవరం నటించిన తీరు చాలా బాగుంది. అయితే ఈ సినిమా చూసిన చాలామంది క్రిటిక్స్ అయితే ఈ సినిమా 100 కోట్ల మూవీ అని గొప్పలు చెప్పారు. ఎందుకంటే కిరణ్ అబ్బవరం కాకుండా ఈ సినిమాలో పెద్ద హీరోలు నటిస్తే ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల సినిమా ఇది అని ఎందుకంటే ఇప్పటివరకు ఈ కాన్సెప్టు ఈ కథ ఏ సినిమాలో కూడా చూడలేదు.
పెద్ద దర్శకుడు, పెద్ద హీరో అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసేదని, కానీ చిన్న హీరో అంతగా గుర్తింపు లేని హీరో అనే చిన్న చూపుతో కొన్నిచోట్ల కిరణ్ అబ్బవరంకి థియేటర్లు కూడా ఇవ్వలేదట. ఈ కారణంగానే కిరణ్ అబ్బవరం సినిమాకి కలెక్షన్స్ తగ్గాయి. లేకపోతే ఈ సినిమా 100 కోట్ల సినిమా అని ఒకవేళ ఈ కాన్సెప్ట్ తో వేరే పెద్ద హీరో వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద100, 150 కోట్లు కలెక్ట్ చేసేదని చాలామంది సినిమా చూసిన క్రిటిక్స్ అన్నారు. ఏది ఏమైనప్పటికీ క మూవీ కిరణ్ అబ్బవరం కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.ఈ సినిమాతో 2024 సంవత్సరంలో కిరణ్ అబ్బవరం కి మంచి బ్లాక్ బస్టర్ హిట్ పడింది. అలాగే ఈ సంవత్సరంలో ఆయన పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి కూడా అడుగు పెట్టారు