సినిమా ఇండస్ట్రీలో కొత్త రూల్ .. ఇకపై అలా చేస్తే హీరోనే కాదు అభిమానులు కూడా జైలుకే..!?

Thota Jaya Madhuri
మితిమీరి పోయిన అభిమానంతో కళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే సినిమా మండలి అలాంటి వాళ్ళు కళ్ళు కనిపించేలా..తెరిపించేలా కొత్త చట్టాన్ని తీసుకురాబోతుందట. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకానిక్ సార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ లైఫ్ లో ఫ్యాన్స్ ఎంత రాద్ధాంతం సృష్టించారో. అసలు అల్లు అర్జున్ జైలుకు వెళ్ళాడు అన్నా.. అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది అన్నా.. దానికి కారణం ఈ ఫ్యాన్స్ అంటున్నారు జనాలు . మరి ముఖ్యంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ 11 నిందితుడిగా పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం చాలా చాలా బాధాకరం అంటూ ఫ్యాన్స్ మండిపడ్డారు .


అయితే ఆ ఫ్యాన్స్ కారణంగానే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు అన్నది సినీ పెద్దలు అభిప్రాయం.  ఒక హీరో వస్తున్నాడు అంటే ఎగబడి చూడడానికి అత్యుత్సాహం చూపించకుండా.. నెమ్మదిగా ప్రవర్తిస్తే ఎవరికీ ఏ నష్టం కలగదు అని అటు ఫాన్స్ ఇటు హీరోస్ ఇద్దరు కూడా చాలా సేఫ్టీ గా ఉంటారు అని .. కొంతమంది హీరోల ఫ్యాన్స్ మాత్రం ఓవరాక్షన్ చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అని ప్రముఖులు మాట్లాడుతున్నారు. ఇక అలాంటి పనులు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు అంటున్నారు సినీ పెద్దలు.


ఏ సినిమా హీరో ఎక్కడికైనా వెళ్తున్నాడు అన్న ..ఏ షాప్ ఓపెనింగ్ ఈవెంట్ కి వెళ్తున్నాడు అన్న .. తన సినిమా ప్రమోషన్స్ కోసం వస్తున్నాడు అన్నా బయట ఎక్కడ కనిపించినా సరే ఎగబడుతూ సెల్ఫీలు ఆటోగ్రాఫ్స్ అంటూ పై పైకి వచ్చిన అక్కడ జనాలకు ఇబ్బందికర సిచ్యువేషన్స్ కలగజేసిన అతనిపై చట్టపరంగా లీగల్ యాక్షన్ తీసుకుంటారట . ఇలాంటి ఒక కొత్త చట్టాన్ని సినిమా మండి అమల్లోకి తీసుకునిరాబోతుందట . అంతేకాదు స్టార్ హీరోస్ కి కూడా కొన్ని కండిషన్స్ అప్లై అయ్యేవిధంగానే కొత్త రూల్ తీసుకురాబోతుందట . ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇకపై ఫ్యాన్స్ హీరోలతో మాట్లాడాలి అన్న హీరోలతో ఫోటో దిగాలి అన్న వణికి పోవాల్సిందే..!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: