చాలామంది యాక్షన్ సీన్స్, మాస్ ఎలిమెంట్స్ చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు టిల్లు స్క్వేర్ మూవీ ఒక ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయని వారు ఉండరు. డి జె టిల్లు మూవీతో మన ముందుకు వచ్చిన సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ లో ఈ సినిమాతో స్టార్ అయిపోయారు. ఆ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని టిల్లు స్క్వేర్ తో మన ముందుకు వచ్చారు. అలా సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ల రొమాన్స్ ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. మరి ఈ ఏడాది టిల్లు స్క్వేర్ మూవీ సిద్దు జొన్నలగడ్డకు ఏ విధంగా బూస్టింగ్ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం..
ఈ ఏడాది చిన్న సినిమాలుగా వచ్చి పెద్దహిట్ కొట్టిన సినిమాలలో టిల్లు స్కేర్ మూవీ కూడా ఉంటుంది.. టిల్లు స్క్వేర్ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుండి డైరెక్టర్ హీరోయిన్స్ ఇలా ఎంతోమంది మారారు. ముందుగా ఈ సినిమాకి నేహ శెట్టిని అనుకున్నప్పటికీ ఆమెను తీసేసారు. ఈ సినిమాలో నేహా ని కేవలం ఒక సీన్ కోసం మాత్రమే వాడుకున్నారు. ఆ తర్వాత శ్రీలీల, కృతి శెట్టి వంటి హీరోయిన్ల పేర్లు కూడా తెర మీద వినిపించాయి. కానీ చివరికి అనుపమ పరమేశ్వరన్ ఫిక్స్ అయింది. అయితే ఎంతో సాప్రదాయంగా ఉండే అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ మూవీలో మాత్రం చాలా బోల్డ్ గా కనిపించింది.ఈ సినిమాతో అనుపమ ఫ్యాన్స్ అందరూ హర్ట్ అయ్యారు. కానీ అనుపమ మాత్రం ఎప్పుడూ ఒకే జానర్ లో సినిమా ఎందుకు అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా చేస్తేనే గుర్తింపు ఉంటుంది అవకాశాలు వస్తాయి అంటూ చెప్పింది.
అలా డైరెక్టర్ మారడంతో పాటు హీరోయిన్లు కూడా మారారు.ఇక ఈ సినిమా షూట్ సమయంలో ఎన్నో అవాంతరాలు అడ్డు వచ్చినప్పటికీ ఎట్టకేలకు సినిమా షూటింగ్ పూర్తి చేసి మార్చ్ 29న విడుదల చేశారు.ఇక దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వందకోట్ల కంటే ఎక్కువగానే కలెక్ట్ చేసింది. టిల్లు స్క్వేర్ ఓవర్సీస్ లో మంచి లాభాలను తీసుకొచ్చిపెట్టింది.మన భారతదేశం కాకుండా ఇతర దేశాలన్నింటిలో కలిపి సుమారు 40 కోట్ల వరకు వసూలు చేసింది. అలా చివరికి టిల్లు స్క్వేర్ మూవీ 70 కోట్ల షేర్ 125 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి దాదాపు 40 కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టింది. అలా చిన్న సినిమాగా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ అతిపెద్ద విజయాన్ని అందుకుంది.అలా 2024 లో సిద్దు జొన్నలగడ్డకి ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు క్యూబ్ కూడా ఉంటుంది అని చిత్ర యూనిట్ ప్రకటించారు