పుష్ప గాడు అక్కడ స్లో అయిపోయాడు.. బ్రేక్ ఈవెన్ కూడా కష్టమేనా.. ?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా .. రష్మిక మందన్న హీరోయిన్గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 ది రూల్. ఈ సినిమా కోసం గత మూడు సంవత్సరాలుగా ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎంత ఆసక్తితో ఎదురు చూశారో తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు కొల్లగొట్టే రికార్డులు సెట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే 11 రోజులు పూర్తి అయింది. వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర రు . 1400 కోట్ల వసూళ్లు దాటేసిన పుష్ప గాడు ఎక్కడి కక్కడ దూసుకుపోతున్నాడు. విచిత్రం ఏంటంటే తెలుగు బెల్ట్ కంటే నార్త్ లో పుష్ప దూకుడుకు అడ్డు అదుపు లేదు. అయితే మలయాళ మార్కెట్లో ను ... అటు తమిళనాడులోను ఈ సినిమా అంచనాలు పూర్తి గా అందుకోలేదు. ఇక యు ఎస్ మార్కెట్లో కూడా పుష్ప ఒక్కసారిగా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. కానీ ఇప్పుడు అక్కడ కొంచెం స్లో అయింది.
టార్గెట్ కి దగ్గరగా వెళుతున్న పుష్ప 2 ఓవర్సీస్ మార్కెట్లో స్లో అయినట్టు ట్రేడ్ వర్గాలు సమాచారం. ఇంకా బ్రేక్ ఈవెన్ కు నాలుగు మిలియన్ డాలర్ల దూరంలో ఉందని ... ప్రస్తుతం సినిమాస్లో అవడంతో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటుందా ? లాభాలు అందిస్తుందా లేదా అన్నది కాస్త సస్పెన్స్ గా ఉంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ సినిమాకు సామ్ సిఎస్ అదనపు నేపథ్య సంగీతం అందించారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను రు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇక పుష్ప 2 సినిమా ను జనవరి 8 లేదా 9న ఓటీటీ లో రిలీజ్ చేస్తారని టాక్ ?