హెరాల్డ్ టాలీవుడ్ సూపర్ హిట్స్ 2024: హనుమాన్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన తేజ సజ్జా .. !
చిన్నపుడే ఇండస్ట్రీకి వచ్చి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాదు.. మార్కెట్ కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు ఈ కుర్రాడు. తేజ గ్రోత్ చూస్తుంటే.. చాలా మంది హీరోలకు కుళ్లు కూడా వచ్చేస్తుందేమో..? అంతగా మనోడు ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నాడు. ఓ బేబీ సినిమాలో చిన్న పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చిన తేజ.. తాజాగా తనపైనే 50 నుంచి 100 కోట్లు ఈజీగా బడ్జెట్ పెట్టొచ్చనే నమ్మకాన్ని నిర్మాతల్లో కలిగిస్తున్నాడు. ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో పెద్ద సినిమాలు వచ్చాయి .. ఆ సినిమాల్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సూపర్ హీరో మూవీ హనుమాన్ కూడా ఒకటి ..
పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .. భారతీయ ఆరాధ్య దైవం హనుమంతుని స్ఫూర్తితో ఈ సినిమాలో తేజ సబ్జా హీరోగా నటించాడు .. ఇండియన్ తొలి సూపర్ హీరో సినిమాగా వచ్చిన హనుమాన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి తేజ సజ్జను పాన్ ఇండియా హీరోగా మార్చింది. ఈ సినిమాకు సీక్వల్ గా జై హనుమాన్ కూడా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది. సినిమాలో హనుమంతుడిగా కన్నడ స్టార్ట్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమాతో తేజ సజ్జా మరోసారి ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.