కపిల్ శర్మకు కౌంటర్ ఇచ్చిన అట్లీ.. దెబ్బకు పొగరు దిగిందిగా..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అట్లీ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకత్వం వహించిన ప్రతి సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈయన బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ హీరో గా జవాన్ అనే సినిమాను రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకి పైగా కలెక్షన్లను కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందిఎం ఈ సినిమాతో అట్లీ క్రేజ్ మరింతగా పెరిగింది.

ఇకపోతే ఇంతకాలం పాటు దర్శకుదిగౌ కెరియర్ను కొనసాగించిన ఈయన తాజాగా బేబీ జాన్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో వరుణ్ దావన్ హీరోగా నటించగా ... కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. దానితో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి అట్లీ తాజాగా కపిల్ శర్మ షో కు గెస్ట్ గా వెళ్ళాడు. ఈ షో లో భాగంగా కపిల్ శర్మ , అట్లి ని ... మిమ్మల్ని చూసి డైరెక్టర్ ఎవరు అని అడుగుతారా అంటూ కపిల్ శర్మ , అట్లిని ప్రశ్నించాడు. దానికి అట్లీ సమాధానం ఇస్తూ ... మీ ప్రశ్న నాకు అర్థమైంది.

నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చింది ఏ ఆర్ మురుగదాస్ సార్. ఆయనకు నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన నా స్క్రిప్ట్ చూసి మెచ్చుకున్నారు. నాకు అవకాశం ఇచ్చారు. నాలో సామర్థ్యం ఉందా ... లేదా అనేది కూడా ఆయన చూడలేదు. కేవలం కథను నమ్మాడు. ప్రపంచం మనలో ఉన్న టాలెంట్ ను చూడాలి కానీ మనం ఎలా ఉన్నాము అనేది కాదు అని అట్లీ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం అట్లీ , కపిల్ శర్మకు ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: