చిన్న కారణంతో చిరుతో సినిమా క్యాన్సిల్ చేసిన స్టార్ డైరెక్టర్.. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే చిరంజీవి తన కెరియర్లో రాఘవేందర్రావు దర్శకత్వంలో ఎన్నో సినిమాలలో నటించాడు. వీరి కాంబోలో రూపొందిన సినిమాల్లో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. కొన్ని సినిమాలు ఏకంగా ఇండస్ట్రీ హిట్లను కూడా అందుకున్నాయి. కానీ ఇంత గ్రేట్ కాంబోలో ఓ సినిమా మిస్ అయింది. ఆ సినిమా ఏది ..? ఎందుకు మిస్ అయింది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి ని రాఘవేంద్రరావు కలిసి ఓ కథను చిన్న లైన్ గా వినిపించారట. అది బాగా నచ్చడంతో సినిమా చేద్దాం అని చిరంజీవి అన్నారట. దానికి రాఘవేంద్రరావు కూడా ఓకే అన్నారట. ఇక కొన్ని రోజుల తర్వాత రాఘవేందర్రావు ఒక రోజు చిరంజీవికి ఫోన్ చేసి నీకు కొంత కాలం క్రితం ఓ లైన్ చెప్పాను కదా ఆ సినిమా కథ మొత్తం పూర్తి అయ్యింది అన్నాడట. ఒకే సారి సినిమా చేద్దామా అని చిరు , రాఘవేంద్రరావు ను అడిగాడట. దానితో ఆయన ఆ కథ నీపై అస్సలు వర్కౌట్ కాదు అని అన్నాడట. ఎందుకు సార్ అని చిరు అడగ్గా ... ఆ సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోయే సన్నివేశం ఉంది. అది నీపై అస్సలు సెట్ కాదు. ఆ స్టోరీ తో వేరే హీరోతో సినిమా చేద్దాం అనుకుంటున్నట్లు చెప్పాడట. దానికి చిరంజీవి ఓకే చెప్పాడట. ఇక ఆ తర్వాత రాఘవేంద్రరావు అదే కథను మోహన్ బాబుకు వినిపించగా ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక అల్లుడు గారు అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మోహన్ బాబు కు ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: