ఎవరు ఊహించని దర్శకుడుతో చిరంజీవి మూవీ పిక్స్ .. బాక్సాఫీస్ షేక్ అవడం కాయం..!
ఇక దీని తర్వాత చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు . ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకం పై సాహు గారపాటి నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది .. అనిల్ రావిపూడి గత సినిమాలకు పూర్తి భిన్నమైన కథ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది . వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ను మొదలు పెట్టబోతున్నారట .. ఇక త్వరలో నే ఈ సినిమా కు సంబంధించి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు .. ముందు గా చిరంజీవి , అనిల్ రావుపూడి సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల తో సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంద ని అంటున్నారు . ఇక అనిల్ రావిపుడి కూడా ప్రస్తుతం 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు.
విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' తర్వాత వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా కావడం వల్ల అభిమానుల్లో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక అనిల్ తెరకెక్కించిన భగవంత్ కేసరి కూడా సెంటిమెంట్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. దీంతో అనిల్ అప్‌కమింగ్ మూవీస్‌పై మూవీ లవర్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇలా వరుస యంగ్ డైరెక్టర్లతో చిరంజీవి సినిమాలు కమిట్ అవుతూ టాలీవుడ్ స్టార్ హీరోల కు సవాల్ విసురుతున్నాడు .