కన్నప్ప : ఫస్ట్ లుక్స్ వస్తున్నాయి.. బజ్ మాత్రం లేదు.. మంచు వారికీ మళ్ళీ నష్టమే..!!

murali krishna
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో 'కన్నప్ప' రూపొందుతోంది. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కావాల్సింది. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం అవుతుండటంతో 2025 ఏప్రిల్‌ 25కి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విడుదలకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉన్నా ప్రమోషన్‌ కార్యక్రమాలు మాత్రం ఆపడం లేదు. ఒక వైపు వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ జరుగుతూ ఉండగా మరో వైపు సినిమా నుంచి ఒక్కో పాత్రను మెల్లగా రివీల్‌ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నేడు సినిమాలో కీలక పాత్రలో నటించిన మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ పాత్ర లుక్‌ను రివీల్‌ చేశారు.కన్నప్ప సినిమాలో మోహన్‌లాల్‌ను 'కిరాత' పాత్రలో విభిన్నమైన లుక్‌లో యుద్ద వీరుడిగా కనిపిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ చూస్తూ ఉంటే మోహన్‌లాల్‌ పాత్ర అత్యంత పవర్‌ ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈమధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలతో పోల్చితే సూపర్‌ స్టార్‌ను కిరాత పాత్రలో విభిన్నంగా చూడబోతున్నారు. ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం మోహన్‌లాల్‌ను కిరాత పాత్రలో కన్నప్ప సినిమాలో చూడటం కోసం వెయిట్‌ చేసే విధంగా లుక్ ఉంది. ఈ విషయమై ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

తెలుగులో మోహన్‌లాల్‌ గతంలో చేసిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ ఫస్ట్ లుక్ కూడా నిరాశపరిచింది అని చెప్పాలి. ఈ పోస్టర్ కూడా ట్రోలింగ్ కు గురి అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ చేస్తే ఖచ్చితంగా నష్టాలు చూస్తారు. ఇకపోతే సౌత్ ఇండియాలోని పెద్దపెద్ద నటులు అంతా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా కథలో మోహన్‌లాల్‌ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమాలోని కిరాత లుక్‌ రివీల్‌ చేయడంతో పాటు 'పాశుపతాస్త్ర ప్రధాత, విజయుడిని గెలిచిన ఆటవిక కిరాత!' అంటూ ఆసక్తికర లైన్స్‌ను షేర్‌ చేశారు. ఆ లైన్స్‌ సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మోహన్‌లాల్‌ లుక్‌కి మంచి స్పందన దక్కిన నేపథ్యంలో ముందు ముందు ఇతర పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లను వరుసగా విడుదల చేసే విధంగా యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: