టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఇది సంచలనం.. బన్నీ అరెస్టు పై మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?

Thota Jaya Madhuri
నిజంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది ఓ సంచలనంగా మారిపోతుంది . అల్లు అర్జున్ అరెస్ట్ అయిన పద్ధతి అందరికీ బాధాకరంగా అనిపించింది.  చాలామంది సినీ ప్రముఖుల అల్లు అర్జున్ ని పరామర్శించడానికి అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి మరి ఆయనను పలకరించారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన పద్ధతి అస్సలు సుకుమార్ కి నచ్చనే నచ్చలేదట. సుకుమార్ - బన్నీ ను చూడగానే బాగా ఎమోషనల్ అయిపోయాడు. జైల్లు నుండి రాగానే బన్నీను చూడటానికి సుక్కు ఇంటికి వెళ్లాడు. ఆ టైం లోనే బాగా ఎమోషన; అయిపోయాడు.


కావాలని వాంటెడ్ గా అల్లు అర్జున్ పరువు తీయడానికి ఈ విధంగా చేశాడు అంటూ తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఆయన పై గుర్రుగా ఉన్నారట . అంతేకాదు అల్లు అర్జున్ అరెస్టుపై ఏ విధంగా పొలిటికల్ కుట్ర జరిగింది అనే విషయం అందరికి తెలియాలి అనే కారణంగా త్వరలోనే సినిమాను తెరకెక్కించబోతున్నారట . అది కూడా ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరోని పెట్టి తెరకెక్కించాలని భావిస్తున్నారట. అల్లు అర్జున్ ఏ విధంగా అరెస్టు అయ్యాడు..? రేవంత్ రెడ్డి ఎందుకు కావాలని అలా బెయిల్ వచ్చినా నైట్ జైల్లు లోనే పెట్టేలా ప్లాన్ చేశాడౌ..? ఎలా క్రియేట్ చేసి బన్నీ పరువు పోగొట్టాలని చూసాడు..? అనే విషయాలను హైలెట్ చేసి సుకుమార్.. అల్లు అర్జున్ అరెస్టుపై ఓ షార్ట్ మూవీ తెరకెక్కించబోతున్నారట .


ఈ న్యూస్ లో ఎంత నిజం ఉంది అని తెలియక పోయినప్పటికీ జనాలు మాత్రం ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఒకవేళ నిజంగానే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన పద్ధతిపై సుకుమార్ సినిమా తెరకెక్కిస్తే మాత్రం ఖచ్చితంగా ఓ సెన్సేషనల్ అయిపోతుంది . అసలు ఆ సినిమాలో హీరోగా నటించే అంత ధైర్యం ఎవరికి ఉంది..? అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండ అయితే ఆ క్యారెక్టర్ కి బాగా సూట్ అవుతాడు అని ..ఆ ధైర్యానికి ఆయన ఆటిట్యూడ్ కి ఆ రోల్ కి కరెక్ట్ గా ఉంటుంది అంటున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: