మెహర్ రమేశ్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బిల్లా’ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పూర్తిగా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించి అనుష్క.. ప్రేక్షకులకు అందాల విందు ఇచ్చింది. ఈ సినిమాలో అనుష్క బికినీ ధరించి ప్రేక్షకులను ఫిదా చేసింది.అంతకు ముందు సినిమాల్లో అనుష్క ఇచ్చిన గ్లామర్ డోస్ వేరు. ‘బిల్లా’ మాత్రం ఆమె మోతాదుకు మించి అందాలను ఆరబోసింది. దీంతో అప్పటి వరకూ అనుష్కపై ఉన్న ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే స్వతహాగా స్వీటీ అనుష్కుకు ఇలాంటివి ఇష్టం ఉండవు. పాత్ర పరంగా ఎక్స్‌పోజింగ్ చేసిన బయటమాత్రం ఆమె చాలా పద్ధతిగా ఉంటుంది. ఆడియె ఫంక్షన్లు అయినా ఏ ఇతర ఈవెంట్లు అయినా ఎంచక్కా చీర కట్టులోనో లేక సల్వార్ కమీజ్‌లోనో కనిపిస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో పూర్తిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పరిమితమైన అనుష్క ఎక్స్‌పోజింగ్‌కి పూర్తిగా దూరమైంది.అయితే బిల్లా సినిమా చూసిన తర్వాత తన తల్లి రియాక్షన్ ఎలా ఉందనే విషయాన్ని అనుష్క ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. సినిమా చూసిన తర్వాత తన తల్లి రియాక్షన్ విని తాను షాక్ అయ్యాను అని స్వీటి పేర్కొంది.నేను పద్దతిగా ఉండాలని మా అమ్మ అనుకుంటుంది. అలాంటిది ‘బిల్లా’ సినిమా చూసినప్పుడు ఇంకా స్టైలిష్‌గా ఉండొచ్చు కదా సగం స్టైలిష్‌గా సగం పద్దతిగా ఎందుకు అంటూ మా అమ్మ అంది. అప్పుడు నేను షాక్ అయ్యాను. మా అమ్మ నుంచి అలాంటి రియాక్షన్ ఊహించలేదు’’ అంటూ స్వీటీ వెల్లడించింది. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా అనుష్క ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో హిట్ అందుకుంది. త్వరలో ఘాటీ అనే సినిమాతో రానుంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.