ఎన్టీఆర్ సినిమాలలో రాజమౌళికి నచ్చే విషయం అదొక్కటేనా..?

murali krishna
స్టార్ డైరెక్టర్ రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు  కాంబోలో ఓ భారీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు SSMB 29గా పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం, అలాగే ఈ మూవీలో సూపర్ స్థార్ మహేష్ బాబు లీడ్ లో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.గత నెల రోజుల క్రితం జక్కన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లోకేషన్ కోసం తెగ సెర్చ్ చేస్తున్నట్టు నెట్టింట్లో ఓ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. అలాగే.. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను జర్మనీలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.ఇదిలావుండగాఫిలిం ఇండస్ట్రీలో మాట మీద నిలబడే వ్యక్తులు చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. అసలు ఒకసారి చెప్పిన మాటను మరోసారి గుర్తుపెట్టుకోవడమే కష్టం.కానీ రాజమౌళి మాత్రం 2017లో తాను ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఇప్పటికీ కుర్చీ వేసుకొని మరీ కూర్చున్నాడు. ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే గురించి తెలియనివారుండరు. సదరు షోలో 2017 సమయంలో రాజమౌళి రాధాకృష్ణతో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ ను తాను నటుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువగా ఇష్టపడతాను అని చెప్పిన విషయం అప్పట్లో వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఆయన సినిమాలు పెద్దగా ఎక్కేవి కాదు రాజమౌళి చెప్పడం చాలామందిని హర్ట్ చేసాయి. అయితే.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ది రానా దగ్గుబాటి షోలో మాట్లాడుతూ కూడా అదే మాట మీద నిలబడుతూ "ఎన్టీఆర్ గారి దర్శకత్వం అంటేనే ఇష్టం, మహాభారతాన్ని ఆయన అర్థం చేసుకున్న కోణం భలే ఉంటుంది" అంటూ రాజమౌళి చెప్పిన విషయాలు భలే ఆసక్తికరంగా ఉన్నాయి.సాధారణంగా అందరూ ఎన్టీఆర్ ను హీరోగా మాత్రమే అభిమానిస్తారు, ఆరాధిస్తారు. కానీ.. ఒక దర్శకుడిగా ఆయన్ను ఇష్టపడే జనాలు చాలా తక్కువ. కానీ.. దర్శకధీరుడు రాజమౌళి మాత్రం ఆయన్ని ఒక దర్శకుడిగా గౌరవించడం అనేది రాజమౌళి దృష్టికోణాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: