సంధ్య థియేటర్ తొక్కిసలాటలో శ్రేతేజ్ బ్రెయిన్ డ్యామేజ్.. త్వరలోనే హెల్త్ బులిటెన్!
పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీ తేజ్ కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అతను కొలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారని అన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న శ్రీ తేజ్ ప్రస్తుతం స్పృహలో లేడని అన్నారు. త్వరలో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని స్పష్టం చేశారు. శ్రీ తేజ్ ఆరోగ్యం మెరుగుపడడానికి వైద్యులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అలాగే శ్రీ తేజ ఘటనపై దర్యాప్తు కూడా జరుగుతుందని చెప్పుకొచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలపడంలో సంధ్య థియేటర్ నిర్వాహకులు విఫలమయ్యారని అన్నారు. అందుకే ఈ ఘోరం జరిగిందని తెలిపారు. అల్లు అర్జున్ రాకపై యాజమాన్యానికి సమాచారం ఉన్నా.. ఎంట్రీ, ఎగ్జిట్, సీటింగ్ ప్లాన్ చేయలేదని స్పష్టం చేశారు. అర్జున్‌తో పాటు అతని ప్రైవేట్ సెక్యూరిటీని లోపలికి అనుమతించారని.. టిక్కెట్‌ల తనిఖీ కోసం సరైన వ్యవస్థ లేదని వెల్లడించారు. అనధికారిక ప్రవేశానికి అనుమతించి లోపల రద్దీ పెరిగేలా చేశారని మండిపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి.. ఆయనను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవలే మద్యంతర బెయిల్ ద్వారా అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి వచ్చారు.