టీఎఫ్డీసీ ఛైర్మ‌న్ గా దిల్ రాజు.. స‌మ‌స్య‌లు తీరుస్తాడా? కొత్త స‌మ‌స్య‌లు సృష్టిస్తారా?

MADDIBOINA AJAY KUMAR
తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత దిల్‌రాజుకి కీలక పదవిని ఇచ్చింది. ఆయనను తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో రేపు ఆయన టీఎఫ్డీసీ ఛైర్మ‌న్ గా పదవికి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఈ పదవిలో దిల్ రాజు రెండేళ్లు కొనసాగానున్నారు. ఎన్నో మంచి మంచి సినిమాలను నిర్మించి విజయం సాధించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న దిల్‌రాజు పేరు సంపాదించుకున్నారు.
దిల్‌ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. ఆయన 1990లో 'పెళ్లి పందిరి’ సినిమాలో పంపిణీదారుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తున్నారు. 2003లో దిల్ సినిమాకు తొలిసారి నిర్మాతగా వ్యవహరించగా ఆ చిత్రం భారీ విజయం సాధించింది. దీంతో అప్పటి నుంచి ఆయన పేరు దిల్రాజుగా మారింది. ప్రస్తుతం దిల్ రాజు రామ్‌చరణ్‌ హీరోగా శంకర్ డైరెక్షన్లో రానున్న ‘గేమ్‌ ఛేంజర్‌’, వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’, అలాగే వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘తమ్ముడు’ సినిమాలను నిర్మిస్తున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న దారుణాలు చూస్తూనే ఉన్నాము. ఇటు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం.. అటు మంచు మోహన్ బాబు ఇంట గొడవలు జరుగుతున్నాయి. ఇకపోతే ఇంతకు ముందు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కూడా జరిగింది. దీంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అభిమానులు టీఎఫ్డీసీ ఛైర్మ‌న్ గా ప్రమాణస్వీకారం చేయబోతున్న దిల్ రాజు..  స‌మ‌స్య‌లు తీరుస్తాడా? లేక కొత్త స‌మ‌స్య‌లు సృష్టిస్తాడా? అని చర్చించుకుంటున్నారు. నిర్మాత గా మంచి సినిమాలు తీసి ఈ అర్హత ను  సంపాదించుకోవడంతో దిల్ రాజు అభిమానులు సంతోసిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: