వామ్మో.. ఏంటి మనోజ్ మొత్తం ఆ సీన్సేనా!

Veldandi Saikiran
సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మనోజ్ బాజ్ పాయ్ ఒకరు. తన నటనతో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో మనోజ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. తెలుగులో పలు సినిమాలలో నటించి మెప్పించాడు. ప్రేమ కథ, పులి, హ్యాపీ, వేదం సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 

ఇక మనోజ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా అనంతరం మనోజ్ వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. కాగా, మనోజ్ రీసెంట్ గా క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిస్పాచ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మనోజ్ కీలక పాత్రలో నటించారు. 


ఈ డిస్పాచ్ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 13న ఈ సిరీస్ రిలీజ్ కాగా, ఈ సినిమాను తిట్లి, ఆగ్రా వంటి సినిమాలను నిర్మించిన కను బెహల్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో హీరోయిన్ గా షహన గోస్వామి అద్భుతంగా నటించింది. అయితే ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చేటువంటి ఇంటిమేట్ సీన్లు చూస్తే నోరు వెళ్ళబెట్టడం ఖాయం.


ఈ సినిమాలో షహనా గోస్వామి, రియ్ సేన్, అర్చిత అగర్వాల్ తో మనోజ్ బాజ్ పాయ్ కొన్ని బోల్డ్ సీన్లలో నటించారు. బోల్డ్ సీన్లలో మనోజ్ ఓ రేంజ్ లో నటించినట్లుగా తెలుస్తోంది. ఈ సీన్లు చూసిన చాలా మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్... చూసిన ఫ్యాన్స్ కూడా... షాక్ అవుతున్నారట. ఇలాంటి సినిమా... ఉంటుందని ఎవరు ఊహించలేదని అంటున్నారు. అయితే కొంతమంది యూత్ మాత్రం ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నట్లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: