రాజాసాబ్‌: ముగ్గురు కాదు...4 గురుతో రొమాన్స్‌ ?

Veldandi Saikiran
స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం "ది రాజా సాబ్". ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు కేవలం చిన్న సినిమాలకే దర్శకత్వం వహించిన మారుతి ఏకంగా ఇప్పుడు ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా సినిమాను తీస్తున్నారు. మొదట ప్రభాస్ డైరెక్టర్ మారుతితో కలిసి సినిమా చేస్తున్నాడని తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అంత చిన్న డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేయడం ఏంటని అన్నారు. కానీ మారుతి మీద ఉన్న నమ్మకంతో ప్రభాస్ ఈ సినిమాలుకు ఒప్పుకున్నాడట.

దీంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. దానికి తగినట్లుగానే ఈ సినిమాలో ప్రభాస్ ఎప్పుడు చేయని విధంగా హారర్ కామెడీ జోనర్ లో నటించనున్నాడు. ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 ఏప్రిల్, 10వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్లుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లు నటిస్తున్నారు.

అయితే ప్రభాస్ ఏకంగా ఈసారి ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించనున్నాడని తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ముగ్గురు కాకుండా ఏకంగా నలుగురు హీరోయిన్లు నటించబోతున్నారట. ఈ విషయం తెలిసే కొంతమంది షాక్ అవుతున్నారట. ఏకంగా ఈ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటించబోతుందట. నయనతార ఐటమ్ సాంగ్ చేయబోతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

డైరెక్టర్ మారుతీతో ఉన్న ఫ్రెండ్షిప్, ప్రభాస్ పై ఉన్న అభిమానంతోనే నయనతార ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కి ఒప్పుకుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయితే కానీ కానీ అసలు విషయం తెలియదు. కాగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ ని ఇలాంటి పాత్రలో చూడలేదని తొందరగా ప్రభాస్ ని ఈ సినిమాలో చూడాలంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: