విక్టరీ వెంకటేష్ ఆఖరుగా సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రద్ధ శ్రీనాథ్ వెంకటేష్ కి జోడిగా నటించగా ... శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందింది. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా ... ఈ మూవీ కంటే ముందు శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో ప్రేక్షకులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు.
అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన పెద్ద ఎత్తున విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల , విమర్శకుల నుండి మాత్రం ఆ స్థాయి రెస్పాన్స్ రాలేదు. దానితో ఈ సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేక పోయింది. దానితో ఈ మూవీ మామూలు విజయాన్ని మాత్రమే అందుకోగలిగింది. ఇకపోతే ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలలో మాత్రం వెంకటేష్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని కొన్ని సన్నివేశాలలో ఆయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన వెంకటేష్ తన నటనతో మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మరి ఈ సంవత్సరం సైంధవ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించి అపజయాన్ని అందుకున్న వెంకటేష్ వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మరి ఈ మూవీ తో వెంకటేష్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.