ఏంటి సమంత నిజంగానే ఆ నిర్మాత దగ్గర నుండి కోట్ల ఖరీదు చేసే ఫామ్ హౌస్ కొట్టేసిందా.. ఇంతకీ టాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది.. నిజంగానే సమంతకి ఆ నిర్మాత ఫామ్ హౌస్ గిఫ్టుగా ఇచ్చారా అనేది ఇప్పుడు చూద్దాం. చాలా మంది సెలబ్రెటీల మీద గాసిప్ లు రావడం ఖాయం.అయితే సమంత మీద గత కొద్ది సంవత్సరాల నుండి ఓ రూమర్ వినిపిస్తోంది. అదేంటయ్యా అంటే..ఓ నిర్మాత దగ్గర నుండి సమంత ఒక ఫామ్ హౌస్ ని గిఫ్ట్ గా తీసుకుందని. ఇక విషయంలోకి వెళ్తే..సమంత ఇప్పటికే ఎంతోమంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో కూడా నటించింది. అయితే ఓ కొత్త హీరోతో నటించడం కోసం సమంత ముందుగా మొండికేసిందట.కానీ ఆ హీరో ఫాదర్ రెమ్యూనరేషన్ తో పాటు ఫామ్ హౌస్ కూడా గిఫ్ట్ గా ఇస్తానని ఆశ చూపడంతో సినిమాకి ఒప్పుకుందట.
ఇక ఆ సినిమా ఏంటయ్యా అంటే అల్లుడు శీను.. బెల్లంకొండ సురేష్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అల్లుడు శీను మూవీ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే నిర్మాత కొడుకు కాబట్టి సినిమా మీద అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ సినిమా కాబట్టి ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ని పెట్టాలని నిర్మాత అనుకున్నారట.ఈ సినిమా కోసం సమంతని సంప్రదించినప్పుడు ఇప్పుడే ఇండస్ట్రీకి వస్తున్నా హీరోతో నేను ఎలా స్క్రీన్ షేర్ చేసుకోగలను. నేను సినిమా చేయను అని చెప్పిందట. కానీ నిర్మాత సురేష్ బాబు మాత్రం పట్టుబట్టి ఈ సినిమాలో నువ్వే హీరోయిన్ గా చేయాలి అని చెప్పారట
అంతేకాదు రెమినరేషన్ తో పాటు ఒక ఫామ్ హౌస్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై రీసెంట్ గా సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే.. సమంత అల్లుడు శీను సినిమా షూటింగ్ సమయంలో స్కిన్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతుంటే ఆమె ట్రీట్మెంట్ కోసం నేను 25 లక్షలు ఇచ్చాను. ఆ తర్వాత తన రెమ్యూనరేషన్ లో ఆ 25 లక్షలు కట్ చేసుకున్నాను. ఇక అల్లుడు శీను మూవీ విడుదలై హిట్ అవ్వడంతో ఆ సంతోషంలో నేను సమంతకి దాదాపు 3 కోట్ల విలువచేసే ఫామ్ హౌస్ ని గిఫ్ట్ గా ఇచ్చాను అంటూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ బాబు చెప్పుకొచ్చారు