జానీ మాస్టర్ కి.. మరోసారి బంపర్ ఆఫర్ ఇచ్చిన రామ్ చరణ్?
ఇలా దశాబ్ద కాలం నుంచి ఎంతో కష్టపడి ఆయన ఒక స్థాయికి చేరుకున్నారు. కానీ ఒక్క అమ్మాయి కారణంగా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు అన్నీ కూడా నీటిలో పోసిన పన్నీరులా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఆయనకు రావాల్సిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయి ఇక తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ కేసు పెట్టింది. ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకు వెళ్లాడు. అయితే కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో ఇలాంటి ఘటన జరగడంతో.. ఆయనకు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ.. పెద్దగా అవకాశాలు రావడం లేదు.
ఇలాంటి సమయంలో మళ్లీ కెరియర్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జానీ మాస్టర్. రీసెంట్ గానే ఆయన ఒక పాటకు కొరియోగ్రఫీ చేసేందుకు ఒప్పుకున్నాడు అనేది తెలుస్తుంది. అయితే జానీ మాస్టర్ ఈ స్థాయిలో ఉండడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కారణం. ప్రొఫెషనల్ గా మాత్రమే కాదు పర్సనల్గా కూడా జానికి ఎప్పుడూ అండగా ఉంటూ వచ్చాడు రామ్ చరణ్. ఇక ఇప్పుడూ రాంచరణ్ మరోసారి జానీకి బంపర్ ఆఫర్ ఇచ్చాడట. గేమ్ చేంజెర్ లో ఒక పాటకి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ఇచ్చేసాడట. అయితే ఏకంగా 30 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఈ పాట కోసం ఖర్చు చేయబోతున్నారట డైరెక్టర్ శంకర్. ధోప్ అనే అంటూ సాగే పాట గేమ్ చేంజెస్ సినిమాకి హైలెట్ కాబోతుందట. తన కెరియర్ లోనే ఈ పాట ది బెస్ట్ గా నిలిచిపోతుందని జానీ మాస్టర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు అనే విషయం తెలిసిందే.