పుష్పకి మూడేళ్లు.. ఈ సినిమా మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?

MADDIBOINA AJAY KUMAR
ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 హిట్ కొట్టి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. స్టార్ హీరో అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తీసిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. అయితే ఇప్పటికే పార్ట్ వన్ హిట్ కొట్టడంతో ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమాను తీశారు. ఇకపోతే పుష్ప 2  మూవీ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇచ్చిందని టాక్ కూడా వినిపించింది. అలాగే స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అన్నీ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయని అభిమానులు తెలిపారు. ఇక అల్లు అర్జున్ ఓ పాటలో వేసిన అమ్మవారి గెటప్ కి మాత్రం ఫాన్స్ పెరిగిపోయారు.. ఆ పాటలో ఆయన యాక్టింగ్ కి ప్రశంసల వర్షం కురిసిందనే చెప్పాలి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటించింది. ఆమె కూడా భార్య పాత్రకు నిలువెత్తు రూపంగా నిలిచిందని అంటున్నారు.
అయితే పుష్ప(ది రైజ్) రిలీజ్ అయ్యి నేటితో 3 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం 2021 డిసెంబర్ 17న విడుదల అయ్యింది. ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు దాదాపు రూ. 250 కోట్లు బడ్జెట్ తో నిర్మించారు. మొదట ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
నేటితో పుష్ప 3 ఏళ్లు పూర్తిచేసుకోవడంతో ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
అల్లు అర్జున్ పుష్ప(ది రైజ్) సినిమాకు నైజాంలో రూ. 37.10 కోట్లు, సీడెడ్ లో రూ. 15.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.03 కోట్ల బిసినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 82.00 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటకలో రూ. 10.70 కోట్లకు, తమిళ నాడులో రూ. 10.90 కోట్లు బిజినెస్ జరిగింది.  
ఈ సినిమా రూ.146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.165.15 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా రూ.19.15 కోట్ల లాభాలతో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. మొత్తంగా సూపర్ హిట్ మూవీ అనే చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: