నేను చూసుకుంటా.. ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచు విష్ణు భరోసా

MADDIBOINA AJAY KUMAR

మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టుగా కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సగం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. మహా భారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వ వహిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్‌ తో పాటు, అక్షయ్ కుమార్, శరత్ బాబు లాంటి స్టార్లు కూడా భాగమవుతున్నారు.
అయితే ఇందులో ప్రభాస్ శివుడి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కన్నప్ప మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. అయితే అంచనాలకు మించి ఈ సినిమాను తెరకెక్కిస్తామని కన్నప్ప టీమ్ చెప్తుంది. డిసెంబర్ లో విడుదల కానున్న ఈ సినిమా వాయిదా పడి వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. ఇటీవల కనప్ప సినిమాలో మోహన్ లాల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.
తాజాగా కన్నప్ప సినిమా గురించి తాజాగా ఒక నెటిజన్ మంచు విష్ణును ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు.  'అన్నా.. సినిమా ఎలా ఉన్నా పర్లేదు. ప్రభాస్ లుక్స్, పాత్ర మాత్రం తేడా రాకుండా చూస్కో. ఒక్కసారి కాదు ఐదు సార్లు వెళ్తా నీ సినిమాకు' అని రాసుకొచ్చాడు. దీనికి మంచు విష్ణు కూడా వెంటనే స్పందించాడు. ‘100 శాతం మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్. నేను మీకు మరిన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. త్వరలో రివీల్ చేస్తాను. అప్పటి వరకు ఓపికపట్టండి’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రజెంట్ ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫాన్స్ కి ఈ సినిమా కోసం వేచి చూస్తున్నట్లు టాక్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: