టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్నాడు ఎన్టీఆర్. అయితే అలాంటి ఎన్టీఆర్... ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో రెండేళ్ల కిందట.. మంచి విజయాన్ని అందుకున్నాడు.
అయితే ఈ సినిమా తర్వాత సింగిల్ గా దేవరతో వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దాదాపు 300 కోట్లతో ఈ సినిమా రిలీజ్ అయితే... సినిమా కలెక్షన్స్ ఎనిమిది వందల కోట్లు దాటిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
దేవర సినిమా పార్ట్ వన్, పార్ట్ 2 గా తెరకెక్కుతోంది. అయితే సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయిన దేవర మొదటి భాగం.... ఇండస్ట్రీని షేక్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమా దాదాపు మూడు భాషల్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించారు. సముద్రం, సముద్రపు ఒడ్డున జీవించే జనాలు, స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తీశారు.
అయితే ఈ దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్... డ్యూయల్ రోల్ చేశాడు. తండ్రి పాత్రలో... అలాగే కొడుకు పాత్రలో మెరిశాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్... జూనియర్ ఎన్టీఆర్ సరసన చేసింది. ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న దేవర సినిమా... మంచి వ్యూస్ రాబట్టుకుంటుంది. అలా 2024 సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ కు తిరుగులేని విజయాన్ని అందించింది దేవర సినిమా. అంతేకాదు... ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంది. సినిమాలు అసలు కథలోకి ఎంట్రీ ఇవ్వగానే పార్ట్ 1 అయిపోతుంది. దీంతో పార్ట్ 2 కోసం జనాలు ఎదురు చూస్తున్నారు.