ఈ ఏడాది వచ్చిన సినిమాలన్నింటిలోకెళ్లా పుష్ప-2 సినిమా అతిపెద్ద హిట్ అయింది. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకి నెల ముందు నుండే ప్రమోషన్స్ మొదలుపెట్టారు.భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు. ఇక ప్రమోషన్స్ కి తగ్గట్టే సినిమా కూడా ఉండడంతో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే 1400 వందల కోట్లను కలెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్నో రికార్డులను సైతం చెరిపివేసింది. మరి అలాంటి బన్నీ ఈ ఏడాది ఎలా మురిపించారో ఇప్పుడు చూద్దాం..
సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-1 మూవీకి సీక్వెల్ గా పుష్ప-2 సినిమా వచ్చింది. ఈ సినిమాకి ముందు నుండి అంచనాలు ఉండడంతో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లోనే టాప్ లేపేసింది.ముఖ్యంగా మొదటి రోజే ఈ సినిమా 294 కోట్లు కలెక్ట్ చేసి ఇండియాలోనే ఫస్ట్ డే అత్యంత భారీ కలెక్షన్లు సంపాదించిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో ఫస్ట్ రోజు కలెక్షన్లలో పుష్ప టు సినిమానే హైయ్యెస్ట్ గతంలో ఆర్ఆర్ఆర్,బాహుబలి వంటి సినిమాలు ఉండేవి.కానీ ఆ సినిమా రికార్డులను పుష్ప టు సినిమా చెరిపివేసింది.
కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లు పుష్ప-2 సినిమా ఈ ఏడాది కుంభస్థలాన్నే బద్దలు కొట్టి 2024 కి ఒక మంచి ఎండింగ్ ఇచ్చింది. అయితే ఈ సినిమా కారణంగా అల్లు అర్జున్ జైలు పాలయ్యారు. ఇక విచిత్రం ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుండే సౌత్ లో నార్త్ లో కలెక్షన్లు మరిన్ని పెరిగాయి. ముఖ్యంగా ఒక సినిమా విడుదలైన పది రోజులకు పెద్ద హీరో సినిమా అయితే 50, 40 కోట్లు కలెక్టు చేసింది. కానీ పుష్ప టు సినిమా విడుదలైన 10వ రోజు 14 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అలా పుష్ప -2 సినిమా ఈ సంవత్సరం చివర్లో ఎంతోమందిని అలరించిన సినిమాగా చెప్పుకోవచ్చు