ఆ వెలితిని నేను పూరిస్తా.. రమణ గోగుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali krishna
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రమణ గోగుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.విజయవంతమైన ఎన్నో పాటలకు స్వరాలు సమకూర్చిన ఆయన తన గాత్రంతోనూ తెలుగు శ్రోతలపై ప్రత్యేకమైన ముద్ర వేశారు. వెంకటేశ్, పవన్‌ కల్యాణ్‌ కథానాయకులుగా నటించిన పలు సినిమాలకి రమణ గోగుల స్వరాలు సమకూర్చడంతోపాటు, పలు పాటల్ని ఆలపించారు. ఈ కలయికల్లో వచ్చిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మరోమారు గొంతు సవరించుకున్నారు. వెంకటేశ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలోని గోదారి గట్టుమీద అంటూ సాగే పాటని మధుప్రియతో కలిసి ఆలపించారు. శ్రోతల్ని ఊపేస్తున్న ఈ పాటతో ప్రయాణం గురించి, తన కెరీర్‌ గురించి మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు రమణ గోగుల.వెంకటేశ్‌ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. 'దిల్‌' రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది.సంగీత దర్శకుడు, గాయకుడు రమణ గోగుల దాదాపు పన్నెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి, 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలోని 'గోదారి గట్టు..' పాటను పాడారు. ఈ సందర్భంగా రమణ గోగుల చెప్పిన విశేషాలు.ఇప్పుడున్న మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ అందరూ చాలా అద్భుతమైన పాటలు, సంగీతం అందిస్తున్నారు. అయితే ఓ న్యూ కైండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌కు ఎక్కడో చిన్న గ్యాప్‌ ఉందనిపిస్తోంది.ఆ గ్యాప్‌ను ఫిల్‌ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కొన్ని కొత్త ఐడియాస్‌ ఉన్నాయి. మంచి కథ, హీరో, దర్శక-నిర్మాతలు, సరైన సమయం ఇలా అన్నీ కుదిరితే కచ్చితంగా సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను'' అన్నారు.ఈ సందర్భంలోనే నాకు మ్యూజిక్‌తో పాటు టెక్నాలజీ అంటే ఇష్టం. దీంతో అబ్రాడ్‌లో ఓ మల్టీనేషనల్‌ కంపెనీకి వర్క్‌ చేశాను. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డాటా ఎనలిటిక్స్‌ వంటి అంశాలపై పని చేశాను. అలాగని సంగీతానికి దూరంగా లేను. నాకు ఇష్టమైనప్పుడు మా ఇంట్లో పియానోను, గిటార్‌ను ప్లే చేస్తూనే ఉంటాను. ఏఐతో సాంగ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. కానీ హ్యూమన్‌ టచ్‌ ఉన్నప్పుడే సాంగ్స్‌ బాగుంటాయి. ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నా నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఈ గ్యాప్‌లో దాదాపు వంద సినిమాలు రిజెక్ట్‌ చేసి ఉంటాను. నాకు ఇష్టం అయితేనే సాంగ్స్‌ కంపోజ్‌ చేస్తాను అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: