హెరాల్డ్ టాలీవుడ్ స్టార్స్ మెరుపులు 2024 : మరోసారి ప్రూవ్ చేసిన నాని.. నెక్స్ట్ ఏంటి..?

praveen
* నానికి లక్కీ ఇయర్ గా మారిన 2024 సంవత్సరం
* అతను తీసిన ఏకైక సినిమా బ్లాక్ బస్టర్ హిట్
* ఈ హిట్టుతో జోరు మీద ఉన్న నాని మరో 'హిట్'కి సిద్ధం
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
ఈ సంవత్సరం నేచురల్ స్టార్ నానికి చాలా కలిసి వచ్చింది అని చెప్పుకోవచ్చు. సరిపోదా శనివారం మూవీతో ఈ హీరో అతిపెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఇది 2024లో నాని నుంచి వచ్చిన ఏకైక సినిమా. ఈ ఎంజాయబుల్‌ యాక్షన్ డ్రామాలో SJ సూర్య నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నాని, సూర్య వీరిద్దరూ నటనలో వారికి వారే సాటి. వారిని ఒక సినిమాలోకి తీసుకొచ్చి అద్భుతంగా నటింపజేశాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. 2023లో దసరా, హాయ్ నాన్న సినిమాలతో అలరించిన నాని ఈ సంవత్సరం కూడా మెరుపులు మెరిపించాడు. కొన్నేళ్లు మాత్రమే అతనికి ఫ్లాప్స్ బాగా ఇబ్బంది పెట్టాయి. 2023 నుంచి ఈ సంవత్సరం చివరి దాకా అతన్ని విజయాలే వరించాయని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం ఈ హీరో హిట్: ది థర్డ్ కేసు సినిమాలో అర్జున్ సర్కార్ అనే ఒక ఐపీఎస్ అధికారి పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే నాని లుక్కు బయటకు వచ్చింది. అతను సాల్ట్ అండ్ పెపర్ అవతారంలో సూపర్ గా కనిపించాడు. ఇక ఈ మూవీ స్టోరీ ఇంకెంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో అని ఫ్యాన్స్ తో పాటు న్యూట్రల్ ప్రేక్షకులు బాగా ఎగ్జైట్ అవుతున్నారు. శైలేష్ కొలను తీస్తున్న ఈ మూవీ వచ్చే సంవత్సరం మే 1న రిలీజ్ అవుతుందని సమాచారం. ఇందులో నాని క్రిమినల్ కేసులను చాలా వినూత్న రీతిలో సాల్వ్ చేస్తాడని తెలుస్తోంది.
ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఈ మూవీ సాగుతుందని చెబుతున్నారు. ఇలా 2024 సంవత్సరం నాని అభిమానుల్లో ఎంతో సంతోషాన్ని నింపింది. ఇక నెక్స్ట్ ఇయర్ కూడా అతను హిట్ కొట్టడం పక్కా అని అభిమానులు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. టాలీవుడ్ లో 2024లో బాగా మెరిసిన హీరోలలో నాని ముందు వరుసలో ఉంటాడని చెప్పవచ్చు. ఆయనకు 2025 సంవత్సరం మరింత కలిసి రావాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: