మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రెడీ అవుతున్న పొలిటికల్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా రిలీజ్ కోసం చరణ్ అభిమానులే కాదు, టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడం వల్ల సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్లో కనిపించనున్నారని సమాచారం. ఇక చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నటిస్తోంది. సీనియర్ డైరెక్టర్, నటుడు ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో సినిమా రూపొందుతుంది.ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలవుతుంది. కాగా ఈ సినిమాలోని ఓ రెండు బ్లాకుల గురించి ఇండస్ట్రీ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మొత్తం 2 గంటల 50 నిమిషాల రన్ టైమ్ తో వస్తున్న గేమ్ ఛేంజర్ లో ఇంట్వర్వెల్ బ్లాక్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట. ఈ ఎపిసోడ్ లో చరణ్ స్టైలిష్ యాక్షన్ ను థియేటర్స్ లో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారెంటీ అని వినిపిస్తోంది. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కు ఆడియెన్స్ షాక్ అవడం పక్కా అని ఈ రెండు ఎపిపోడ్స్ ను సినియాను ఓ రేంజ్ లో నిలబెడతాయని గట్టిగా వినిపిస్తుంది. ఈ ప్రచారం ఎంత వరకు నిజమనేది మరికొద్ది రోజుల్లో తేలుతుంది. ఇదిలా ఉండగా ‘గేమ్ చేంజర్’ సినిమాను తమిళంలో ఎస్వీసీ, ఆదిత్య రామ్ మూవీస్ విడుదల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిల్మ్స్ అనీల్ తడానీ విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 21న యు.ఎస్‌లోని డల్లాస్‌లో ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. కాగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 భారీ డిజాస్టర్ తరువాత వస్తున్న గేమ్ చేంజెర్ సంక్రాంతి బరిలో ఎలాంటి హైప్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.