హెరాల్డ్ టాలీవుడ్ స్టార్స్ మెరుపులు 2024: రవితేజకు కలిసి రాని ఏడాది.. నిరాశలో ఫ్యాన్స్.!
•నటనతో సూపర్ హిట్ కానీ..
•రవితేజ ఇకనైనా మేల్కొంటారా?
టాలీవుడ్ లో మాస్ హీరోగా పేరు పొందిన రవితేజ.. ఎప్పుడూ కూడా చిత్ర విచిత్రమైన కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.. ప్రస్తుతం ఈయన వయసు 56 సంవత్సరాలు అయినా కూడా 18 ఏళ్ల కుర్రాడిలా ఎనర్జిటిక్ తో సినిమాలలో తన ఆటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు రవితేజ. కొన్ని సందర్భాలలో తన ఆటిట్యూడ్ వల్లే సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 2024లో రవితేజకు సినిమాలపరంగా పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు.
ఈ ఏడాది రవితేజ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఒకటి.. ఇందులో ఈగల్ సినిమా కంటెంట్ పరంగా, కథ పరంగా బాగున్నప్పటికీ ఎందుకో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఈ సినిమా సీక్వెల్ కూడా ఉన్నట్లు చివరిలో ఒక ట్విస్టును కూడా చూపించారు. ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ సినిమాకి సోలో డే దొరికినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేక పోయింది. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.
ఇక ఆ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ , రవితేజ కాంబినేషన్లో ఆగస్టు 15న విడుదలైన చిత్రం మిస్టర్ బచ్చన్.. ఈ చిత్రాన్ని బాలీవుడ్ సినిమా రైడ్ చిత్రాన్ని రీమేక్ చేసినట్లు సమాచారం.. ట్రైలర్ , పాటలు, ప్రోమోలు చాలా పవర్ ఫుల్ గానే ఆకట్టుకున్నప్పటికీ తీరా సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి ఎందుకు వచ్చాం రా బాబు అన్నట్టుగా అభిమానులకు విసుగు తెప్పించింది మిస్టర్ బచ్చన్ సినిమా. దీంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కి కూడా నష్టాలు వచ్చాయట.. అయితే రెండు చిత్రాలు కూడా ఈ ఏడాది విడుదలైనప్పటికీ ఇందులో రవితేజ నటన మాత్రం అద్భుతంగా ఉన్నది. మరి 2025లో మాస్ జాతర, కోహినూరు అనే చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. మరి ఈ సినిమాల విషయంలోనైనా రవితేజ జాగ్రత్తపడి సక్సెస్ అందుకుంటారని అభిమానులు కోరుకుంటున్నారు.