తల్లికిచ్చిన మాట కోసమే ఎన్టీఆర్ చాలామందికి దూరమయ్యాడు.. ఆ మాట ఏమిటంటే..?

Divya
టాలీవుడ్ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో ఏళ్ళు అవుతోంది. ప్రస్తుతం తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్న ఎన్టీఆర్ ఎన్నో సినిమాలను చేస్తూ కొత్త కథాంశాలతో అభిమానులను అలరిస్తూ ఉన్నారు. rrr చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి విజయాన్ని అందుకున్నారు. బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ కి భార్య క్రేజ్ ఉండడంతో ఇటీవలే వార్ 2 చిత్రంతో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కి తల్లి అంటే చాలా ఇష్టము అయితే ఎన్టీఆర్ తన తల్లికి ఒక మాట ఇచ్చారట.. ఆ మాట మీద నిలబడి ఎంతోమందికి దూరమయ్యారని వార్త ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రోజులలో పిల్లల్ని పెంచడం వాళ్లు పెరగడం ఎక్కువగా మొబైల్ ఇంటర్నెట్ వంటివి యూస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చాలామంది వ్యసనాలకు బానిస అవుతూ ప్రేమ పెళ్లిళ్లు వంటివి చేసుకోవడంతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నాక విడిపోవడానికి చాలానే జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి విషయంపై జూనియర్ ఎన్టీఆర్ తల్లి మాత్రం చాలా తెలివిగాని వ్యవహరించింది.

జూనియర్ ఎన్టీఆర్ చదువుకునే రోజులలో ఒక మాట తన తల్లికి ఇచ్చారట.. అదేమిటంటే నువ్వు ఎట్టి పరిస్థితులలో ఎటువంటి తప్పుడు పనులు చేయకూడదని నందమూరి కుటుంబానికి ఎలాంటి చెడ్డ పేరు నీవల్ల రాకూడదని అలాగే ఏ ఆడపిల్ల కన్నీరు కూడా నీవల్ల రాకూడదని ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పిందట.. ఈ విషయం పైన కూడా తన తల్లికి ఎన్టీఆర్ మాట ఇవ్వడంతో ఎన్టీఆర్ చదువుకునే రోజులలో కూడా ఏ అమ్మాయి వెనుక పడడం కానీ ఏ అమ్మాయితో ప్రేమలో పడడం కానీ చేయలేదట. తల్లికిచ్చిన మాట కోసం ఎన్టీఆర్ ని ఎంతో మంది ప్రేమించిన వాటికి ఎలాంటి రియాక్ట్ అయ్యేవారు కాదట. అందుకే పెద్దలు కుదిరిచిన సంబంధాన్ని చేసుకున్నారు ఎన్టీఆర్. దీంతో పలువురు నెటిజన్స్ తల్లికిచ్చిన మాట వల్ల ఎంతో మంది అమ్మాయిలకు ఎన్టీఆర్ దూరమయ్యాడు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ న్యూస్ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: