పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల క్రితం హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదలు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" అనే సినిమాను స్టార్ట్ చేసి , పూర్తి చేసి విడుదల కూడా చేశాడు. అలాగే బ్రో అనే సినిమాను స్టార్ట్ చేసి , కంప్లీట్ చేసి విడుదల కూడా చేశాడు. ఇక ఈ సినిమాను పెండింగ్లో పెట్టేసి పవన్ కళ్యాణ్ , సుజిత్ దర్శకత్వంలో ఓజి , హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను కూడా స్టార్ట్ చేశాడు. ఇకపోతే హరిహర వీరమల్లు సినిమాను త్వరగా కంప్లీట్ చేయాలి అని ఆలోచనకు పవన్ కళ్యాణ్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయినట్లు , మరి కొంత కాలం లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ సినిమాకు పెద్ద మొత్తంలో డేట్స్ ఇచ్చినట్లు , దానితో ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా , ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభం అయ్యింది. కానీ ఈయన ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమా యొక్క దర్శకత్వ బాధ్యతలను స్వీకరించాడు.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన మొదటి సాంగును వచ్చే సంవత్సరం జనవరి 1 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది వరకు చాలా సార్లు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఆ తేదీన విడుదల కానుంది , ఈ తేదీన విడుదల కానుంది అని అనేక వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా మొదటి పాట మాత్రం విడుదల కాలేదు. మరి వచ్చే సంవత్సరం జనవరి 1 వ తేదీన ఆయన ఈ సినిమా మొదటి పాట విడుదల అవుతుందో లేదో చూడాలి.