రెండు ముక్కలుగా "మెగా" ఫ్యామిలీ.. మరో లొల్లి.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదుగా..!?
ఈ క్రమంలోనే ఇన్నాళ్లు పడిన గొడవలు మొత్తం హుష్ కాకి అంటూ ఎగిరిపోయాయి . ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వార్ కి ఫుల్ స్టాప్ పడిపోయింది . అయితే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో కలవడం ఒక మెగా హీరోకి ఇష్టం లేదు అంటూ రెండు రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఆ హీరోకి మొదటి నుంచి అల్లు అర్జున్ అంటే కూసింత కోపమే . రీసెంట్గా అల్లు అర్జున్ ఎదురైనా కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అంటూ వార్తలు వినిపించాయి. అయితే పుష్ప సినిమాకి సపోర్ట్ చేయకపోవడం అదేవిధంగా అల్లుఅర్జున్ పుష్ప సినిమా విషయంలో ఏ మెగా హీరో పేరుని ప్రస్తావించకపోవడం బాగా హీట్ పెంచేసింది .
కానీ అవన్నీ మెగాస్టార్ చిరంజీవి లైట్గా తీసుకున్నాడు . శత్రువైన ఇంటికి వస్తే పలకరించాలి అన్న పద్ధతిని ఫాలో అయ్యాడు . అల్లు అర్జున్ - స్నేహారెడ్డి ఇంటికి వస్తే ఆప్యాయంగా పలకరించారు . నాగబాబు కూడా అదే విధంగా చేశారు . అయితే ఇప్పుడు ఆ హీరోకి మాత్రం అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో కలవడం అస్సలు ఇష్టం లేదట. ఆ కారణంగానే మెగా ఫ్యామిలీలో గొడవలు కూడా జరుగుతున్నాయట. మనల్ని ఇంత బాధ పెట్టిన వాళ్ళని మన ఇంటి మనిషికి పొలిటికల్ గా సపోర్ట్ చేయని వ్యక్తికి మనమెందుకు సపోర్ట్ చేయాలి ..? అంటూ కొత్త పాయింట్ లేవదీసి అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీలో చోటు లేదు అనే విధంగా మాట్లాడుతున్నారట . దీంతో మెగా ఫ్యామిలీలో మరో లొల్లి మొదలైంది అంటున్నారు జనాలు . అసలు మెగా అల్లు ఫ్యామిలీ కలిస్తే ఏ గొడవ ఉండదు అనుకున్న మూమెంట్లో మెగా హీరోస్ ఇలా మెలిక పెడుతూ ఉండడం షాకింగ్ గా ఉంది..!