తెలుగు సినిమా ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత.. ఇదేం కర్మ సామి..?
కల్కి - పుష్ప 2 సినిమాలు కూడా తెలుగు కంటే ఇతర భాషలోనే ఎక్కువ వసూళ్లు తెచ్చుకున్నాయి. అదే తెలుగులో మాత్రం అనుకున్న స్థాయిలో ఈ సినిమాలు చూసేందుకు ప్రేక్షకులకు కాస్త భయం పడుతోంది. సినిమాల పై ఉన్న క్రేజ్ గ్యాస్ చేసుకునేందుకు వీలైనన్ని ఎక్కువ ధియేటర్లలో విడుదల చేసి భారీగా టికెట్లు పెట్టి వందల కోట్ల వసూళ్లను చూపించుకోవడానికి ప్రభుత్వాలను కూడా దారికి తెచ్చుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. మన తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా సూపర్ సక్సెస్ అవుతుంటే ఇతర భాషల సినిమాలను కూడా మనవాళ్లు నెత్తిన పెట్టుకుంటున్నారు.
తమిళ సినిమా మహారాజా - మాన్యు మేల్ బాయ్స్ - అమరన్ - లక్కీ భాస్కర్ లాంటి ఇతర భాషల సినిమాలు .. ఇతర భాషల హీరోలు నటించిన సినిమాల్లో కూడా మనవాళ్లు సూపర్ హిట్ చేస్తున్నారు. విక్రమ్ - సూర్య లాంటి హీరోల సినిమాలు కూడా భారీ అంచనాలతో తెలుగులో రిలీజ్ అయ్యాయి. ఏదేమైనా మన తెలుగు సినిమాలకు ఈ ఏడాది బయట బ్రహ్మరథం పట్టినా తెలుగులో ఇతర భాషల సినిమాలను ఎంజాయ్ చేస్తూ ఉండటం మన తెలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇక్కడ బ్రేక్ ఈవెన్ కాకపోవటం ఆశ్చర్యకరం.