బాలయ్య తరువాత బాబీ టార్గెట్ ఆ స్టార్ హీరోనేనా..?

murali krishna
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన 'డాకు మహారాజ్‌' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటించగా శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రలో కనిపించబోతుంది. డిసెంబర్‌లో రావాల్సిన ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల సంక్రాంతికి విడుదల చేయడం జరుగుతుంది. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి అంచనాలు పెంచుతూ వచ్చిన దర్శకుడు బాబీ ఇటీవల టీజర్ విడుదల చేసి ఒక్కసారిగా ఫ్యాన్స్‌కి కిక్‌ ఇవ్వడంతో పాటు అందరిలోనూ అంచనాలు మరింత పెంచి ఆహా ఓహో అనిపించాడు.టీజర్ విడుదల అయినప్పటి నుంచి డాకు మహారాజ్‌ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలావుండగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ లతో వర్క్ చేసే అవకాశం దర్శకుడు బాబీకి దక్కింది. కమర్షియల్ సినిమాలను తీస్తూ స్టార్ డైరెక్టర్ గా ముందుకు సాగిపోతున్న బాబీ ప్రభాస్ తో కూడా అలాంటి సినిమా చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఈ కథకి ప్రభాస్ ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు.కానీ దాన్ని హోల్డ్ లో పెట్టారట. ప్రభాస్ లైనప్ చాలా పెద్దగా ఉండటంతో బాబి డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా చేసే అవకాశం ఉంది. కానీ అది ఎప్పుడూ అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం అది సూపర్ సక్సెస్ సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక మిర్చి సమయంలో ప్రభాస్ ఎలా ఉన్నాడో అలాంటి ఒక కథలో మరోసారి అతన్ని చూపించడానికి బాబీ సిద్ధం అవుతున్నాడనే చెప్పాలి.కొన్ని రోజుల క్రితమే బాబి , ప్రభాస్ కి ఓ కథ వినిపించగా ఆ కథ అద్భుతంగా నచ్చడంతో ఆయన కూడా బాబీ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: