"అల్లు"డు కోసం "మెగా"స్టార్స్ అలా చేస్తారా..?
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. పుష్ప2 సినిమా హిట్ అయిన కారణంగా పుష్ప2 టీం ఓ బిగ్ పార్టీని ఇవ్వాలి అంటూ ఫిక్స్ అయిందట . ఈ పార్టీకి టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు కొంతమంది స్టార్స్ ని కూడా ఇన్వైట్ చేయాలి అంటూ ప్లాన్ చేసిందంట . అయితే ఈలోపే అల్లు అర్జున్ అరెస్టు అవ్వడం అందరికీ షాకింగా అనిపించింది . ఆ పార్టీ కాస్త పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఆ పార్టీని ప్లాన్ చేస్తున్నారట సుకుమార్ .
అంతేకాదు ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ గా హైలైట్ అయ్యే విధంగా మెగాస్టార్ చిరంజీవి ఇన్వైట్ చేస్తున్నారట. అయితే పుష్ప2 సినిమా ప్రమోషన్స్ ఏ ఈవెంట్ కి కూడా మెగాస్టార్ రాలేదు. మరీ ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా పిలిస్తే రాను అన్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు కోసం వస్తాడా ..? రాడా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అల్లు అర్జున్ స్వయానా ఇంటికి వెళ్లి మరి ఆయనకు సారీ చెప్పాడు అంటూ వార్తలు వినిపించాయి. దీంతో మెగా ఫ్యాన్స్ కూసింత కూల్ అయ్యాడు. మెగాస్టార్ కూడా కూల్ అయ్యాడు అనే తెలుస్తుంది. అయితే పార్టీకి చీఫ్ గెస్ట్ గా వస్తాడా..? రాడా..? అన్నది ప్రశ్నర్ధకంగా మారింది . ఈ పార్టీకి మెగా హీరోస్ అందరిని కూడా సుకుమార్ ఇన్వైట్ చేయబోతున్నారట . చిరంజీవి - రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్ - నాగబాబు - వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజను కూడా ఇన్వైట్ చేస్తున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!