ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన ప్రభాస్.. కారణం ఇదే
ఈ క్రమంలో హీరో ప్రభాస్ వారికోసం ఓ ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. తాను అక్కడికి రాలేకపోతున్నానంటూ ఫ్యాన్స్‌కు ప్రభాస్ క్షమాపణలు చెప్పారు. కొత్త సినిమా షూటింగ్‌లో కాలికి స్వల్ప గాయమవ్వడం వల్ల ప్రస్తుతానికి రాలేకపోతున్నానని వెల్లడించిన ఆయన త్వరలోనే కలుస్తానని ఫ్యాన్స్కు చెప్పారు. ప్రభాస్ ప్రస్తుతం బాగానే ఉన్నానని తెలిపారు. చివరిలో ప్రభాస్ కల్కి మూవీని ఎంజాయ్ చేయండంటూ చెప్పుకొచ్చారు.
ఇక స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ అనే తెలుగు రొమాంటిక్ హారర్ సినిమా 2025, ఏప్రిల్ 10న థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సినిమాకి మారుతి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రింద టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ కూడా నటించారు. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం, కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందిస్తున్నారు. ప్రభాస్ ఇటీవల విడుదలైన సలార్, కల్కి వంటి సినిమాలలో ఉన్నట్లు ఉండరని ది రాజా సాబ్ టీమ్ తెలిపింది. అయితే ది రాజా సాబ్ ఒక రొమాంటిక్ హారర్-కామెడీ కాబట్టి ప్రభాస్ అందంగా, ఆడంబరంగా కనిపిస్తాడాని చెప్పుకొచ్చారు.