సాయి పల్లవి జీవితంలో ఎప్పటికీ నెరవేరని కోరికలు.. అవి ఏంటంటే
ప్రేమమ్ మూవీకి అవార్డ్
ఓ అవార్డ్ ఫంక్షన్ కు అతిథిగా వచ్చిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ప్రేమమ్ సినిమాకు గాను సాయి పల్లవికి అవార్డు ఇస్తూ తనని మెచ్చుకున్నారట. అంతేకాకుండా తనతో కలిసి సినిమా చేయాలని ఉందని పునీత్ రాజ్‌కుమార్, సాయి పల్లవికి చెప్పారంట. అయితే ఆయన గుండెపోటుతో మరణించడంతో సాయి పల్లవి కోరిక నెరవేరాదు. ఇకపోతే గ్లామరస్ హీరోయిన్ సాయి పల్లవికి బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి సినిమా చేయాలని ఎప్పటినుండో ఉండే అంట. కానీ, ఆయన కూడా కోలన్ ఇన్ఫెక్షన్ కారణంగా 53 ఏళ్ల వయసులోనే మరణించారు. దాంతో ఆ కోరిక కూడా నెరవేరకుండా అయింది.
ఇక తన మూడో కోరిక విషయానికి వస్తే.. సాయి పల్లవికి బిజినెస్ మ్యాన్ రతన్ టాటా అంటే అభిమానం ఎక్కువ అట. రతన్ టాటా కుక్కలను సైతం ట్రీట్ చేసే విధానం అంటే తనకి చాలా ఇస్తామని తెలిపింది. ఆయనని కలిసి కాసేపు ఆయనతో టైమ్ స్పెండ్ చేయాలని అనుకుంది అంట. కానీ రతన్ టాటా 2024 అక్టోబర్ 9న అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఇలా మరోసారి కూడా సాయి పల్లవి కోరిక ఎప్పటికీ నెరవేరనిదిగా అయింది.
ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి తండేల్ మూవీ చేస్తుంది. ఈ సినిమాను చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.